Delhi rapistspng

delhi-rapists.png

Posted: 03/16/2013 12:23 PM IST
Delhi rapistspng

నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళు పట్టుబడ్డ కేసులు, శిక్షలు కూడా లెక్కచెయ్యరు. పట్టుబడ్డ వాళ్ళకి తెలివి లేదు, మేము ఇంకా తెలివిగా చేస్తామనుకుంటారు కానీ వారిలో పరివర్తన తీసుకుని రావటం కష్టసాధ్యమైన పనని ఇంకా జరుగుతున్న సంఘటనలు చెప్తున్నాయి.  

ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులో దేశవ్యాప్తంగా సంచలనం జరిగింది. ప్రధాన నిందితుడు జైల్లో ఉరిపోసుకుని చనిపోయి మూడు రోజులే అయింది. అప్పుడే మరో కేసు వెలుగుచూసింది.

ఇద్దరు యువకులు ఒక మహిళను అపహరణ చేసి బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్తుంటే అత్యాచారం నుంచి రక్షించుకోవటానికి ఆమె కదులుతున్న కారులోంచి కిందికి దూకింది. ఈ సంఘటన నిన్న రాత్రి 10-45 కి ఔటర్ ఢిల్లీ అమన్ విహార్ ప్రాంతంలో జరిగింది. ఎకౌంటెంట్ గా పని చేస్తున్న 24 సంవత్సరాల యువతి ఇంటి వైపు నడుచుకుంటూ వెళ్తుండగా ఆమెకు పరిచయస్తులే అయిన ఇద్దరు యువకులు, 24 సంవత్సరాల కులదీప్, 19 సంవత్సరాల దీపక్ లు ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించి తీసుకెళ్ళే ప్రయత్నం చేసారు. వాళ్ళ నుంచి తప్పించుకోవటం కోసం ఆ యువతి చేసిన ప్రయత్నంలో ఆమెకు దెబ్బలు తగిలాయి.

నిందితులు వెంటనే ఆ స్థలాన్ని వదిలి పారిపోయారు. అక్కడ చుట్టుపక్కల ఉన్న స్థానికులు ఆమెను హాస్పిటల్ కి తరలించారు. గాయాల తీవ్రత ఇంకా తెలియదు కానీ ప్రస్తుతం ఆ యువతి ప్రాణాపాయం నుంచి తప్పించుకుందని మాత్రం వైద్యులు ప్రకటించారు.

కులదీప్ నిన్న రాత్రి, దీపక్ ని ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేసారు.

-శ్రీజ

related article

http://www.teluguwishesh.com/teluguhome/376-topnews/42856-international-womens-day-.html

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kavita daughter claims forced marriage
24 pak army personnel killed in road mishap  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles