Ap assembly continues same scenes

ap assembly, noicy scenes in assembly, assembly adjourned, babli issue, telangana issue

ap assembly continues same scenes

assembly-scene.png

Posted: 03/16/2013 11:18 AM IST
Ap assembly continues same scenes

వాయిదా తీర్మానలను సభాపతి తిరస్కరించటంతో విపక్షాలు ఈ రోజు మళ్ళీ ఆందోళనకు దిగారు.  దానితో శాసనసభ 10 గంటల వరకూ వాయిదా పడింది.  ప్రతిపక్షాలు ఈ రోజు ఇచ్చిన వాయిదా తీర్మానాలు ఇవి-

తెలుగు దేశం పార్టీ బాబ్లీ ప్రాజెక్ట్ మీద, తెలంగాణా ప్రతిపాదనను కోరుతూ తెరాస, రైతుల నష్టపరిహారాన్ని కోరుతూ వైకాపా, నీటి ఎద్దడి మీద సిపిఐ, బలహీనవర్గ ఉప ప్రణాళికలమీద భాజపా, పండ్ల రైతుల నష్టపరిహారం మీద సిపిఎమ్ చర్చలను కోరుతున్నారు.

10 గంటలకు తిరిగి ప్రారంభించిన శాసన సభలో బ్రేక్ తర్వాత టివి సీరియల్లాగా అదే దృశ్యం కొనసాగింది.  బాబ్లీ ప్రోజెక్ట్ గురించి తెలుగు దేశం పార్టీలు, తెలంగాణా విషయంలో తెరాస సభ్యులూ సభాపతి దగ్గర గందరగోళాన్ని సృష్టిస్తూ మరోసారి సభను వాయిదా వెయ్యవలసిన అవసరాన్ని కలిగించారు.  

బాబ్లీ మీద ముఖ్యమంత్రి అఖిల పక్ష సమావేశానికి సన్నిద్ధం చేస్తున్నారని మంత్రి ఆనం ప్రకటించారు.  అది ఎప్పుడన్నది కూడా ముఖ్యమంత్రి ఈరోజు ప్రకటిస్తారని కూడా ఆయన సభలో అయినా సభలోనే చర్చించాలంటూ తెదేపా పట్టుబట్టింది.  తెలంగాణాకు రావలసిన ప్రాజెక్టులను ప్రభుత్వం ముక్కు పిండైనా రప్పించుకుంటామంటూ తెరాస నాయకుడు ఈటెల రాజేందర్ సవాల్ చేసారు.

మరోసారి సభను ప్రారంభించినా మార్పు లేకపోయేటప్పటికి శాసనసభను సోమవారం వరకు వాయిదా వేస్తున్నట్టుగా సభాపతి ప్రకటించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles