Opposition parties prepared for no confidence motion

ap state assembly, no confidence motion, trs party, bjp party, tdp party, governor of ap, cm of ap

opposition parties prepared for no confidence motion

no-confi-motion.png

Posted: 03/14/2013 08:44 AM IST
Opposition parties prepared for no confidence motion

ap-assembly

ఈరోజు అవిశ్వాసాన్ని ప్రకటించటానికి తెలుగు దేశం పార్టీ మినహా మిగతా ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.  తెలంగాణా రాష్ట్ర సమితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు విడివిడిగా రాష్ట్ర ప్రభుత్వం పట్ల తమ అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ శాసన సభలో ప్రవేశపెట్టనున్నాయి.  రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం, పార్టీ తరఫునుంచి ముందుగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టదలచుకున్నట్లుగా సభాపతికి నోటీసివ్వాలి.  అందుకు మద్దతుగా 30 మంది శాసన సభ్యులు కనీసం ఉంటేనే దాన్ని స్వీకరించటం జరుగుతుంది.  ఆ తర్వాత అవిశ్వాసం మీద జరగవలసిన చర్చ తంతులను ఎప్పుడు నిర్వహించాలనే విషయాన్ని నిర్ణయించటానికి సభాపతి ఆ అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనను శాసన సభ వ్యవహారాల సలహా సంఘానికి అందిస్తారు.
నిన్న ఉభయసభలనూ ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ప్రతిగా ఈరోజు సభలో ముందుగా ముఖ్యమంత్రి కృతఙతలు తెలియజేసుకునే కార్యక్రమం ఉంటుంది.  ఆ తరువాత ఈ రోజు అనుకున్నట్టుగా నిజంగానే అవిశ్వాస తీర్మానాలకు అభ్యర్థనలను సభాపతికి ఇచ్చినట్లయితే, అందుకు అర్హమైన 30 శాసన సభ్యుల మద్దతు ఉందా లేదా అని పరిశీలించటానికి సభాపతి నాదెండ్ల మనోహర్ అన్ని పార్టీల అభ్యర్థులను కలిపి చూస్తారా లేక విడివిడిగానా అన్నది వేచి చూడవలసివుంది.  
తెరాస ఇచ్చే అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా సిపిఐ, భారతీయ జనతా పార్టీ, తెలంగాణా నగారా సమితి అభ్యర్థులు తోడు నిలబడుతున్నారు.  వీరితో సంబంధం లేకుండా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడిగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతోంది.  అయితే కాంగ్రెస్ మాత్రం మా ప్రభుత్వానికి ఏమీ కాదు అన్న ధీమాను వ్యక్తం చేస్తోంది.  అందుకు కారణం ప్రతిపక్షాల మధ్య ఐకమత్యం లేకపోవటమే అని వారు అంటున్నారు.  అయినా ఎందుకైనా మంచిదని అనర్హత వేటు తయారుగా ఉంది సుమా అంటూ తమ పార్టీ శ్రేణులను హెచ్చరిస్తున్నారు.  
ఈ విషయంలో దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ని తెరాస కాంగ్రెస్ తో కుమ్ముక్కయిందని, పైకి మాటలే కానీ చేతల వరకూ వచ్చేటప్పటికి వెనకడుగు వేస్తోందని దెప్పి పొడుస్తుంటే, అవిశ్వాసం ఎప్పుడు పెట్టాలో మాకు తెలుసు, ప్రజా సమస్యల మీదనైతే ఎప్పుడైనా పెట్టవచ్చు, అందుకు మా మద్దతుంటుంది కానీ రాజకీయ లబ్ధికోసం పెట్టే అవిశ్వాస తీర్మానం కోసం కాదని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Last date for submission of aadhar details extended
Yadagiri guttapng  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles