Last date for submission of aadhar details extended

aadhar card, gas subsidy, student scholarships, aadhar linked cooking gas

last date for submission of aadhar details extended

aadhar-submission-time.png

Posted: 03/14/2013 09:10 AM IST
Last date for submission of aadhar details extended

aadhar-registration

ఆధార్ కార్డ్ కి గ్యాస్ సబ్సిడీకి ఉన్న సంబంధం మూలకంగా రాష్ట్రంలో ఆధార్ కార్డ్ కోసం జనం తొక్కిసలాడుతున్నారు.  ఇంతవరకూ గ్యాస్ వినియోగదారులలో 30 శాతం మాత్రమే తమ ఆధార్ వివరాలను నమోదు చేసారని గ్యాస్ కంపెనీలు చెప్తున్నాయి.  ఆధార్ వివరాలను ఈ నెల 15 వరకూ అందజేయాలని ఇచ్చిన గడువులో పని పూర్తి చెయ్యటం కష్టంగానే కనిపిస్తుండటం వలన గడువుని ముందుకి పెంచారు.  
కొత్త పద్ధతిని ప్రవేశపెట్టినప్పుడు ముందు కొన్ని అవాంతరాలు, కష్టనష్టాలూ తప్పవు కానీ ఆధార్ ని అన్నిటితో అనుసంధానం చెయ్యటం వలన ఒక విధంగా మంచే జరగబోతున్నా, అవినీతిని అరికట్టటంలో సహాయకారిగా అనిపిస్తున్నా, ప్రస్తుత పరిస్థితుల్లో ఆధార్ కోసం నమోదు చేసుకున్న దగ్గర్నుంచీ కార్డ్ వచ్చేంత వరకూ మధ్యలో ప్రతి మెట్టు దగ్గరా ఏవో సమస్యలు సందిగ్ధాలు చోటు చేసుకుంటూనేవున్నాయి.  
విద్యార్థుల స్కాలర్ షిప్ లతో ముడిపెట్టటం వలన విద్యార్ధులు వారి తల్లిదండ్రులలోనూ ఆవేదన, ఆరాటాలు మొదలయ్యాయి.  ఒకపక్క విద్యార్థుల కోసం కాలేజ్ లలో ప్రత్యేకమైన ఏర్పాట్లు, గ్యాస్ కోసం కుటుంబ సభ్యులలో గ్యాస్ ఎవరి పేరు మీద ఉంటే ముందుగా వారికి ఆధార్ ఇచ్చే ఏర్పట్లు జరిగాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ap assembly adjourned for one hour
Opposition parties prepared for no confidence motion  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles