Italy refuses to surrender mariners

italy, supreme court of india, indo italian relations

italy refuses to surrender mariners

italy-refuses.png

Posted: 03/12/2013 12:39 PM IST
Italy refuses to surrender mariners

భారత జలాల్లో మత్స్యకారులను కాల్చి చంపిన ఇద్దరు ఇటలీ నావికులను భారత్ కి న్యాయ విచారణకు పంపించటానికి ఇటలీ దేశం అనూహ్యంగా నిరాకరించింది.  ఇటలీ ప్రభుత్వం నుంచి అందిన ఈ లేఖను విదేశాంగ శాఖ పరిశీలిస్తోందని అధికారులు తెలియజేసారు.  భారత దేశ పోలీసుల అదుపులో ఉన్న నిందితులు మాస్సిమిలియానో లాట్టోర్, సిల్వాటోర్ గిరోన్ లను ఇంతకు ముందు రెండు సార్లు ఇటలీకి పంపించటం జరిగింది.  ఒక సారి క్రిస్టమస్ జరుపుకోవటానికి, మరోసారి ఓటు హక్కుని వినియోగించుకోవటానికి.  అయితే మొదటిసారి క్రిస్ట్ మస్ కి పంపించినప్పుడు ఇటలీ ప్రభుత్వంతో వాళ్ళని తిరిగి పంపించే ఒప్పందం జరిగింది కానీ రెండవ సారి పంపించినప్పుడు అలా జరగలేదు.

ఈ కేసులో దౌత్యపరంగా ఒక నిర్ణయానికి రానందున భారత దేశ అత్యున్నత న్యాయస్థానం పంపిన నోటీసులను పరిగణనలోకి తీసుకోవటం లేదని ఇటలీ ప్రభుత్వం అంటోంది.  సముద్రజలాల చట్టాల ప్రకారం, ఈ కేసు భారత న్యాయపరిధిలో ఉన్నదని తాము అనుకోవటం లేదని ఇటలీ వాదన.  అంతర్జాతీయ చట్టాల ముసుగులో ఇటలీ దేశం నేరస్తులను భారత దేశానికి అప్పగించకపోవటం ఇరు దేశాల మధ్యా సంబంధాల పట్ల నష్టం కలిగిస్తుందని విదేశాంగ శాఖ అధికారులు భావిస్తున్నారు.  

ఇటలీ వాదన ప్రకారం, ఆ నావికులు ఇటలీ సరుకుల నావలో ఉన్నమాట నిజమే కానీ సముద్ర దొంగల నుండి సరుకుని, నావను కాపాడుకోవటం కూడా వారి బాధ్యతే.  అయినా భారత సుప్రీం కోర్టు, ఈ కేసు భారత న్యాయ పరిధిలోకి వస్తుందని జనవరిలో తీర్పునిచ్చారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nirbhay missile deviatedjpg
Ram singh parents request to leave alone  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles