Ram singh parents request to leave alone

delhi gang rape accused, ramsingh, ram singh suicide in tihar jail

ram singh parents request to leave alone

ram-singh-parents.png

Posted: 03/12/2013 09:45 AM IST
Ram singh parents request to leave alone

ramsingh-wailing-parents

మామానాన్న మమ్మల్ని వదిలిపెట్టండి!

అమానుషంగా జరిగిన ఢిల్లీ సామూహిక అత్యాచారంలో ప్రధాన నిందితుడు రాం సింగ్ తల్లిదండ్రులు చేతులెత్తి నమస్కరిస్తూ వేడుకున్నారు.  అంతా అయిపోయింది.  మమ్మల్ని ఇంకా వేధించకండి అంటూ మీడియా ప్రతినిధుల ముందు కంట తడిపెట్టుకున్నారు.

 రాజస్థాన్ లో గ్రామంలో నివసించే రాం సింగ్ తండ్రి మంగేలాల్ భార్యతో కలిసి వారం రోజుల క్రితమే ఢిల్లీ వచ్చారు.  ఢిల్లీ ఆర్.కె.పురం రవిదాస్ క్యాంప్ లో వారి కొడుకులు రాం సింగ్, ముఖేశ్ లు నివసించిన ఇంట్లో ఉంటున్నారు.  ఆ ఇంటి పక్కనే పొరుగున నివసిస్తున్న ఆశా వాళ్ళకి దూరపు చుట్టమవటంతో వారి బాగోగులు చూసుకుంటున్నది.  తిహార్ జైల్లో ఉరిపోసుకుని చనిపోయిన కొడుకు శవం చూసి వచ్చిన తర్వాత విలపిస్తున్న తల్లిదండ్రులను సాంత్వన పరుస్తోంది.  

రాంసింగ్ చాలా కోపిష్టని, అందరితో గొడవలు పడుతుండేవాడని ఆ చుట్టుపక్కల నివసించేవారు చెప్పారు.  పుట్టెడు దుఃఖంలో మునిగి అవమాన భారంతో నలిగిపోతున్న మంగేలాల్, అది కచ్చితంగా హత్యే కాని ఆత్మహత్య కాదు అన్నారు.  అయితే ఈ విషయంలో చుట్టుపక్కల వాళ్ళు ఎటువంటి వ్యాఖ్యలనూ చెయ్యలేదు.  

తల్లి దండ్రుల వేదన అర్థమవుతూనేవుంది.  కొడుకులు చేసిన పనికి చట్టరీత్యా వాళ్ళు బాధ్యులు కారు.  పైగా కడుపుకోతను ఎవరూ కొట్టిపారెయ్యలేరు.  అయినా కన్నందుకు వాళ్ళకి ఇవన్నీ భరించక తప్పదు.  పాపం చేస్తే పాపం చేసినవారి ఖాతాలో అది ఎలాగూ నమోదవుతుంది కానీ అంతటితో అది ఆగదు.  వాళ్ళతో సంబంధమున్నవారందరూ దాని ఫలితాన్ని అనుభవిస్తారు.  రావణుడు చేసిన పనికి అతని సోదరులు, తల్లి, భార్య, కుమారుడు, సైన్యం, మొత్తం లంకంతా కష్టాలను అనుభవించింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Italy refuses to surrender mariners
Trs declared readiness to move no confidence motion  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles