Osama bin laden son in law abu ghait arrested

bin laden, abu ghait, 9-11 terrorismm, terrorists

osama bin laden son in law abu ghait arrested

binladen-soninlaw.png

Posted: 03/08/2013 10:45 AM IST
Osama bin laden son in law abu ghait arrested

abu-ghait

ఒసామా బిన్ లాడెన్ అల్లుడు, ఒకప్పు డు ఒసామాకి అధికార ప్రతినిధైన సులేమాన్ అబు ఘైత్ ని పట్టుకుని అమెరికాకి తీసుకుని వచ్చారు.  ఈ రోజు న్యూయర్క్ కోర్టులో హాజరు పరచనున్నారు.  13 సంవత్సరాలు బిన్ లాడెన్ కి కుడిభుజంగా పనిచేసిన అబు ఘైత్ ని పట్టుకోవటం ఉగ్రవాదాన్ని అణచటానికి చేస్తున్న పోరాటంలో మంచి మలుపు అని యుఎస్ అటర్నీలన్నారు.  ఆ కాలంలో ఘైత్ ఉగ్రవాద చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు.  ఉగ్రవాదులు చేసిన విధ్వంసం బాపుతు ఙాపకాలు అమెరికా వాసుల మనసులో ఇంకా తాజాగానే ఉంది అన్నారు ఒక అటర్నీ.
9-11 విధ్వంసం తర్వాత బిన్ లాడెన్ అబు ఘైత్ ని పిలిపించుకుని తనతో పాటే ఉగ్రవాద కార్యక్రమాల్లో తనకి సహాయకుడిగా పెట్టుకున్నాడు.  అబు ఘైత్ ఆ పనిలో పూర్తి అంగీకారంతో చేయూతనిస్తూ వచ్చాడు.  2002 సంవత్సరంలో ఆఫ్గన్స్ స్థాన్ నుంచి ఇరాన్ పారిపోయి దశాబ్ద కాలంగా అక్కడే తలదాచుకున్నాడు.  సెప్టెంబరు 12, 2001 నాడు అల్ ఖైదా తరఫున మాట్లాడుతూ, అమెరికాని అమెరికాకు మద్దతు నిచ్చే దేశాలకు, మీ మీద పెద్ద సైన్యం సమాయత్తమౌతోంది జాగ్రత్త అని హెచ్చిరించాడు.  యూదులు, క్రిస్టియన్లు, అమెరికన్ల మీద పోరాటం సల్పమని ఇస్లామ్ దేశాలకు పిలుపునిచ్చాడు.  
అమెరికా శత్రువులను న్యాయాస్థానానికి తీసుకుని రావటానికి మేం చేసుకున్న సంకల్పం కాలమూ, దూరాల వలన ఎప్పుడూ బలహీన పడదన్నారు యుఎస్ అటర్నీ జనరల్ ఎరిక్ హోల్డర్.  అమెరికా వాసులను భయభ్రాంతులను చేసి వారి దైనందిక జీవితంలో అల్లకల్లోలాన్ని సృష్టిద్దామనుకునే ఉగ్రవాదులకు ఇది హెచ్చరిక అవుతుంది.  ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా వెతికి పట్టుకుంటాం.  న్యాయం నుంచి చట్టం నుంచి ఎవరూ పారిపోలేరు అని కూడా ఆయన అన్నారు.  అయితే విచారణకు ఇంకా తేదీ నిర్ణయం కాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Development in dilsukhnagar bomb blast case
Sunrays touch surya bhagawan in arasavalli temple  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles