Tirupati balji earning half billion per anum

tirupati, tirumal, venkateswara swamy, tirumala tirupati devasthanams

tirupati balji annual earnings half billion

ttd-income.png

Posted: 03/07/2013 03:14 PM IST
Tirupati balji earning half billion per anum

tirupati-balajiతిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం ప్రకటించిన వచ్చే సంవత్సరం అంచనాల ప్రకారం అంటే 2013-14 ఆర్థిక సంవత్సరానికి తితిదే ఆదాయం 2248 కోట్లు ఉంటుంది.  అంటే అమెరికన్ కరెన్సీలో అర్ధ బిలియన్ డాలర్లు! 

555.20 కోట్ల రూపాయలు అంటే మొత్తం ఆదాయంలో దాదాపూ నాలుగోవంతు ఆదాయం వడ్డీ రూపంలో వస్తుంది.  ఇవి కాక భక్తుల కానుకలు, తలనీలా వేలం, లడ్డూ ప్రసాదాలు, కళ్యాణ ఆర్జిత సేవల్లాంటి ఆదాయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి.  అయితే మిగతా ఆదాయాలను 2012-13 మాదిరిగానే వచ్చే సంవత్సరానికి కూడా అంచనా వేసినా, వడ్డీ ఆదాయాన్ని మాత్రం ఈ సంవత్సరం ఉన్న 490 కోట్ల రూపాయల స్థానంలో వచ్చే సంవత్సరం 555.20 కోట్లు ఉంటుందని అంటున్నారు.  

తితిదే ఛైర్మన్ కనుమూరి బాపిరాజు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎల్ వి సుబ్రహ్మణ్యం ప్రకటించిన 2013-14 బడ్జెట్ వివరాలలో, ఆదాయంలో అధిక భాగం హుండీలో భక్తులు సమర్పించిన కానుకల రూపంలో వస్తుందని, అది 859 కోట్ల రూపాయలుంటుందని అంచనా అని చెప్పారు.  

తిరుమల తిరుపతి దేవస్థానం స్వామి దర్శనం చేసుకునే భక్తుల సౌకర్యం చూడటమే కాకుండా కార్యక్రమాలను నిర్వహించే సిబ్బందికి ఇచ్చే జీత భత్యాలే 350 కోట్ల రూపాయలు.  ఇలా వేలాది మందికి ఉపాధి కల్పించటమే కాకుండా, ఇంకా ఎంతో మందికి వ్యాపారంలో గడించే అవకాశం కూడా కలుగజేసింది.  తిరుపతి లాడ్జిలు, హోటళ్ళు, టాక్సీలు నడిపేవారు కూడా ఎంతో మంది డబ్బు గడిస్తూ బ్రతుకుని వెళ్ళదీసుకోగలుగుతున్నారంటే అదంతా వెంకన్న చలవే అంటారు వాళ్ళు.

తిరుపతి స్థల పురాణంలో చెప్పినట్టుగా వేంకటేశ్వర స్వామి పద్మావతిని వివాహమాడటం కోసం కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడని, ఆ అప్పుని తీరుస్తూనే ఉన్నాడని అంటుంటారు.  సంవత్సరం సంవత్సరం ఆయన ఆదాయం పెరిగిపోతూవుంది.  ఇప్పటికైనా ఆ అప్పు తీరిందో ?

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Property tax sparks off divorces in china
17 year girl delivers in girs hostel  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles