17 year girl delivers in girs hostel

rajasthan, jaipur, girls hostel

17 year girl delivers in girs hostel

girl-delivers-in-hostel.png

Posted: 03/07/2013 03:03 PM IST
17 year girl delivers in girs hostel

మహాభారతంలో కుంతీదేవి కథ చెప్తారు.  ముని వరమే శాపమై ఆమె సూర్యుని వలన ఒక మగబిడ్డను కంటుంది.  అతని పేరు కర్ణుడు.  కానీ ఈ కాలంలో అది సాధ్యమా.  ఎవరికీ తెలియకుండా ఎవరైనా గర్భం దాల్చి కనగలరా.  అది దాచే విషయం కాదు, దాచినా దాగేది కాదు.  సమాజంలో ఒక ఆడపిల్లే ఆ పని చెయ్యలేకపోయినప్పుడు బాలికల హాస్టల్ లో వార్డెన్ పర్యవేక్షణలో గడుపుతున్న విద్యార్థిని గర్భం దాల్చటం, కడుపులో శిశువు పెరిగి పెద్దవటం, కనటం ఇవన్నీ సాధ్యమేనా.  

రాజస్తాన్ నాగౌర్ జిల్లాలోని బాలికల హాస్టల్ లో 17 సంవత్సరాల వయసులో ఉన్న బాలిక 10 వ తరగతి విద్యార్థిని ఈ మంగళవారం ఉదయం ప్రసవించటం చర్చనీయాంశమైంది.  చంటి బిడ్డ ఏడుపు విని తోటి బాలికలు వెళ్ళి చూడగా స్నానాల గదిలో మగపిల్లవాడిని కన్న అమ్మాయి కనిపించింది.  హాస్టల్ వార్డెన్ హైమలతని సస్పెండ్ చేసామని, ప్రిన్స్ పల్ భన్వర్ లాల్ ని తొలగించామని కలెక్టర్ భండారి తెలియజేసారు.   కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తల్లి, శిశువులకు వైద్య సదుపాయాలందించి ఆమె గార్డియనైన తాతను పిలిపించి, అతనితో వాళ్ళిద్దరినీ పంపించేసామని చెప్పారు.  

తప్పెవరిదన్నది ఇంకా తెలియలేదు.  మైనర్ అవటం వలన విషయాన్ని గోప్యంగా ఉంచారనుకున్నా, ఎంత కాలం ఉంచగలరు, తీరా కనేంతవరకూ వేచి చూడవలసిన పనేమిటన్నది కూడా తెలియలేదు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tirupati balji earning half billion per anum
Saibaba temple in shirdi grapples with severe water crisis  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles