Ias officer vishnu to cbi custody

ias officer vishnu, land scam, cbi, vishnu ias officer,

IAS officer vishnu to CBI custody

IAS-officer-vishnu.gif

Posted: 03/07/2013 01:50 PM IST
Ias officer vishnu to cbi custody

IAS officer sent to CBI custody

సామాజిక కేంద్రానికి  కేటాయించిన  భూమిని ప్రైవేటు  వ్యక్తులకు  కట్టబెట్టిన  వ్యవహారంలో ఐఏఎస్ అధికారి  విష్ణుతో  పాటు మరో 11 మంది పై సీఐడీ  అధికారులు  కేసు నమోదు  చేశారు.  విశాఫ పట్నంలోని మువ్వలవానిపాలేంలో 4, 114 చదరపు  గజాల స్థలాన్ని  వుడా  సామాజిక కేంద్రం కోసం  కేటాయించింది. విష్టు 2001 లో వూడా  ఉపాధ్యక్షుడిగా  ఉన్నప్పుడు  ఈ స్థలాన్ని  21 ప్లాట్లుగా  విభజించి అమ్మేశారు. దీనిపై  శ్రీ బాలజీ  పార్కు  నివాసితులు  హై కోర్టును  ఆశ్రయించారు.  న్యాయస్థానం వుడా  అక్రమ కేటాయింపుల్ని  తప్పబట్టింది.  హైకోర్టు తీర్పును  సవాలు చేస్తూ  వుడా సుప్రీంకోర్టును   ఆశ్రయించింది. సుప్రింలోనూ  వుడాకు  చుక్కెదురైంది.  ఈ క్రమంలో  కేసు మళ్లీ హైకోర్టుకు  చేరగా.. అక్రమ కేటాయింపులపై  న్యాయస్థానం  సీబీఐ విచారణకు  ఆదేశించింది. విచారణ జరిపిన  సీబీఐ  నివేదికను  రాష్ట్ర ప్రభుత్వానికి  సమర్పించింది. దీని  ప్రకారం చర్యలు తీసుకోవాలని  ప్రభుత్వం  సీఐడీని ఆదేశించింది.  ఎవరూ ఫిర్యాదు  చేయకుండా చర్యలు  ఎలా  తీసుకుంటామని  సీఐడీ  అడిగింది.  దీంతో  ఐఏఎస్  అధికారి విష్ణుతో  పాటు అక్రమాలతో  సంబంధం  ఉన్నవారిపై  సీఐడీ కి ఫిర్యాదు చేయాలని  అప్పటి  వుడా ఉపాధ్యక్షుడిని ప్రభుత్వం  ఆదేశించింది.  గతంలో పని చేసిన  అధికారి ఫిర్యాదు   చేయడానికి వెనుకంజ  వేశారు.  తాజాగా వుడా ఉపాధ్యక్షుడు  యువరాజ్  హైదరాబాద్ వచ్చి  సీఐడీకి  ఫిర్యాదు చేశారు.  ఈ మేరకు కేసు నమోదు చేసిన అధికారులు  మోసం, కుట్ర ఫోర్జరీలతో పాటు అవినీతి  నిరోధక  చట్టం కింద విష్ణుతో  పాటు మరో 11 మంది పై కేసు  నమోదు చేశారు.  దర్యాప్తు  బాధ్యతలు  డీఎస్సీ  వెంకటనారాయణకు అప్పగించారు.  విష్ణుతో  పాటు మిగతా 11 మందిని  విచారించి  వాంగ్మూలన్ని నమోదు చేయనున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Saibaba temple in shirdi grapples with severe water crisis
Shoes factory in gachibowli  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles