Nia vehicles chased by media vehicles

hyderabad bomb blast, national investigation authority, media,

nia vehicles chased by media vehicles

nia-chased.png

Posted: 03/03/2013 10:08 AM IST
Nia vehicles chased by media vehicles

సామాన్యంగా ముందు వెళ్తున్న వాహనాలను అవసరమైతే పోలీసులు ఛేజ్ చెయ్యాలి కానీ నిన్న అర్థరాత్రి పోలీస్ వాహనాలు ముందు, వాటి వెనక ఛేజ్ లు జరిగాయి.  వెనక ఛేజ్ చేసిన వాళ్ళెవరో కాదు,  మీడియా.  మీడియా అంటే ప్రజల ముక్కు, చెవులు, కళ్ళు, నోరు కూడా.  ముక్కు తో వార్తలను పసిగట్టాలి, చెవులతో వినాలి, కళ్ళతో చూడాలి, నోటితో నిర్భయంగా మాట్లాడాలి.  ఇదీ మీడియా- ప్రజల కోసం ఉన్న ఙానేంద్రియాలు.  అయితే చాలా సార్లు మీడియాకు తెలియకుండా ఎన్నో పనులు జరుగుతుంటాయి.  అయినా వీలయినంత వరకూ పోలీసుల కదలికలు, దర్యాప్తు సంస్థల కదలికలను మీడియా కనిపెడుతూనేవుంటుంది. 

జాతీయ దర్యాప్తు సంస్థ చేస్తున్న దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ళ దర్యాప్తులో భాగంగా ఢిల్లీ తిహార్ జైల్ లోంచి మఖ్బూల్, ఇమ్రాన్ లను హైద్రాబాద్ తీసుకొచ్చి బేగంపేట లో వారి కార్యాలయంలో విచారణ చేస్తున్నారు.  నిన్న అర్థరాత్రి వాళ్ళని దిల్ సుఖ్ నగర్ ఘటనా స్థలికి తీసుకెళ్ళారు.  అయితే తిన్నగా వెళ్ళకుండా సోమాజీ గూడా, రాజ్ భవన్ రోడ్, ట్యాంక్ బండ్, తార్నాకా, ఉప్పల్, ఎల్ బి నగర్ మార్గంలో దిల్ సుఖ్ నగర్ చేరుకున్నారు.  ఆ ఖైదీలను అక్కడ దించటం వెంటనే మళ్ళీ వాహనాలను ఎక్కించేయటం కూడా జరిగిపోయింది.  మళ్ళీ మలక్ పేట, కోఠి, ట్యాంక్ బండ్, ప్యార్ డైజ్ మార్గంలో తిరిగి బేగం పేటలోని కార్యాలయానికి తీసుకుని వెళ్ళిపోయారు.  ఈ ప్రహసనమంతా సరిగ్గా గంట పట్టింది.  ఒంటి గంటకు బయలు దేరి రెండు గంటలకు తిరిగి జాతీయ దర్యాప్త సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు.  ఆ గంట సేపూ ముందు పోలీసు వాహనాలు, వారిని వెంటాడుతూ మీడియా వాహనాలు రోడ్ల మీద పరుగులు తీసాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  President visits bangladesh during agitations
Amitabh likes freedom in journalism  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles