Amitabh likes freedom in journalism

amitabh bachchan, abc corporation, journalism

amitabh likes freedom to talk in journalism

amitabh-bacchan.png

Posted: 03/03/2013 09:20 AM IST
Amitabh likes freedom in journalism

amitabh-wishesపెద్దై ఏమవుతావురా అని చిన్నప్పడు మా పెద్దవాళ్ళు అడిగితే, పోలీస్ అని తడుముకోకుండా చెప్పేవాళ్ళం.  ఎందుకంటే సినిమాల్లో పోలీసులు హీరోలు, బయట కూడా అందరూ భయపడేది పోలీసులకే, వాళ్ళ యూనిఫాం, టోపీ, బూట్లు, దర్పం, ఎవరినైనా కసురుకోగలగటం, అవసరమైతే కొట్టగలగటం, ఇవన్నీ చూసి మా పిల్లలందరికీ పెద్దైన తర్వాత పోలీసే అవాలి అనిపించేది. 

అమితాభ్ బచ్చన్ కి మరుజన్మలో పాత్రికేయుడవాలనుందట.  పెద్దై అవుతాననటానికి వయసు మీరి పోయింది కాబట్టి వచ్చే జన్మకి ప్లాన్ చేసుకుంటున్నారేమో ఆయన.  ప్రస్తుతం ప్రకాశ్ ఝా నిర్మిస్తున్న సత్యాగ్రహ- డెమోక్రసీ అండర్ ఫైర్ అనే చిత్రంలో నటిస్తున్నారు అమితాభ్ బచ్చన్.   చక్కటి సంస్కారం, ఉట్టిపడే మర్యాద, ఎవరినీ నొప్పించకుండా మాట్లాడగలిగే నైపుణ్యం- నైపుణ్యం అనే దానికంటే ఆయన ప్రవృత్తి అని ఆయన గుణంగానే చెప్పుకోవచ్చు- ఇలాంటి లక్షణాలున్న అమితాభ్ కి ఒక్కోసారి అనిపించి ఉండవచ్చు- ఎవరేమైనా అనుకున్నా పట్టించుకోకుండా, భయపడకుండా, సందేహించకుండా, నిర్భయంగా అనుకున్నది బయటకు మాట్లాడగలిగే స్వేచ్ఛానందాలు గల వృత్తి జర్నలిజమని, అలాంటి వృత్తిలో ఉంటే ఎంత బావుండునని. 

అయితే, దూరపు కొండలు నునుపు అన్న సామెత తెలియని వ్యక్తి కాదు అమితాభ్.  ఈ మాటల ద్వారా మీడియా ప్రసన్నం చేసుకునే ప్రయత్నం కూడా అయ్యుండవచ్చు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nia vehicles chased by media vehicles
Cooperatives minister kasu krishna reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles