Women jac formed for telangana cause

telangana agitation, jac for telangana, women jac for telangana

women jac formed for telangana cause

women-t-jac.png

Posted: 03/02/2013 10:11 AM IST
Women jac formed for telangana cause

ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం మరో ఐకాస ఆవిర్భవించింది. 29 మంది సభ్యలతో తెలంగాణా మహిళా జెఏసి ని ప్రారంభిస్తున్నామని నిన్న సికంద్రాబాద్ లోని తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలలోని మహిళా విభాగ నాయకురాళ్ళు, వారితో పాటు భాజపా, సిపిఐ, న్యూ డెమాక్రసీ పార్టీలలోని మహిళా నాయకురాళ్ళు పాల్గొన్న సభలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి హాజరైన వారిలో, తెలంగాణా విద్యావంతుల వేదిక, వైద్యుల ఐకాస, న్యాయవాదుల ఐకాస, అర్ టి సి ఐకాస, గెజిటెడ్ అధికారుల ఐకాస, టిఎన్ జివోల ఐకాస లకు చెందిన మహిళా నేతలు కూడా పాల్గొన్నారు.

ప్రస్తుతం ఏర్పాటైన అడహాక్ కమిటీలో ప్రగతి శీల మహిళా సంఘం నాయకురాలు సంధ్య కన్వీనర్ గా వ్యవహరిస్తారు. ఆమెతో పాటు పనిచేయటానికి మరో ఆరుగులు కో కన్వీనర్లను ఎంపిక చేసుకున్నారు. మొత్తం 10 జిల్లాల్లోనూ కమిటీలను సుస్థిరం చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా శాశ్వత కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రగతి శీల మహిళా తెలంగాణా ఇస్తామిస్తామంటూ కాంగ్లెస్ పార్టీ మోసం చేస్తూ వస్తోందంటూ విమర్శిస్తూ సంఘం నాయకురాలు సంధ్య మాట్లాడిని తర్వాత న్యూడెమాక్రసీ నాయకురాలు దేవకి, భాజపా నాయకురాలు అనురాధా రెడ్డి ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణా కోసమే పుట్టామంటూ చెప్పుకునే తెరాస లోని మహిళా విభాగం హాజరు కాకపోవటం ప్రత్యేకంగా కనిపించింది.

-శ్రీజ


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Raja paksa denies killingr of son of ltte leader prabhakaran
Center for out of court settlements to be opened today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles