Space based solar power costly and risky

space based solar power, solar energy, alternative to electricity

space based solar power costly and risky

solar-power-station.png

Posted: 03/01/2013 04:13 PM IST
Space based solar power costly and risky

విద్యుత్ లేని జీవితాన్ని ఊహించనేలేని స్థితిలో ఉన్నాడు మానవుడు.  నరకమనేది ఎక్కడో లేదు, భూమ్మీద విద్యుత్ లేని ప్రదేశమే అది అంటాడు.  ఒక్క వెలుతురు కోసం వెలిగించుకునే విద్యుద్దీపంతో మొదలై, గాలికోసం పంఖాలు, ఆహార పదార్థాలు నిలవుంచుకోవటానికి ఫ్రిజ్ లు, వాతావరణాన్ని చల్లబరచుకోవటానికి ఎసిలు, కర్మాగారాల్లో యంత్రాలు పనిచెయ్యటానికి అవసరపడుతూ, చివరకు ఏ క్షణం కూడా విద్యుత్ లేకుండా ఉండలేని స్థితికి వచ్చిన మానవాళికి ఇప్పుడు పుట్టిన దగ్గర్నుంచీ ప్రతి పనికీ విద్యుత్ అవసరం పడుతోంది.  ఉత్పత్తులకే కాకుండా, విద్యకూ, వినోదానికి, వృత్తి వ్యాపారాల్లోనూ అవసరం పడుతోంది విద్యుత్తు. 

solar-space-station

విద్యుత్తుతో అవసరాలు పెరిగిపోయి దాని ఉత్పత్తి తగ్గిపోయేటప్పటికి అలా ఆధారపడ్డ విద్యుత్తు కోసం అల్లాడే పరిస్థితి ఏర్పడుతోంది.  ప్రత్యామ్నాయాలకోసం వెదికి వేసారారందరూ.  గ్యాస్ తోనూ, బొగ్గుతోనో విద్యుదుత్పత్తి చేస్తూ కాలుష్యాన్ని పెంచుకుంటున్నా సరే విద్యుత్తు అవసరం ఉంది కాబట్టి తప్పనిసరి అవుతోంది. 

ప్రత్యామ్నాయం ఉంది అదే సౌరశక్తి.  దాని వలన కాలుష్యం పెరిగి పర్యావరణానికి హాని కలగటమనేది ఉండదు.  నిజమే కాని దానితో విద్యుత్తును ఉత్పత్తి చెయ్యటం అధిక ఖర్చుతో కూడుకున్న పనిగా తయారై అది మూలనపడింది.  ఈ ప్రత్యామ్నాయ శక్తే గనక తక్కువ ఖర్చుతో లభిస్తే.  ఇక కావలసిందేముంది. 

మాజీ నాసా వైఙానిక శాస్త్రవేత్త జాన్ మాన్ కిన్స్, మానవాళికి అత్యంత ఉపయోగకరమైన అంతరిక్షం నుంచి సౌరశక్తిని పొందే మార్గాన్ని కనిపెట్టారు.  ఎస్ పి ఎస్ ఆల్ఫా అనే ప్రణాళికలో పరిశోధన చేసిన ఈ శాస్త్రవేత్త, దాని గురించి వివరిస్తూ, లైట్ వెయిట్ ఉన్న మోడ్యూల్స్ ని అంతరిక్షంలోకి పంపి వాటిని అక్కడ సమీకరించి శంకు ఆకారంలో పేర్చినట్లయితే అవి అద్దాల ద్వారా సూర్యుని సౌరశక్తిని గ్రహించి సోలార్ పేనల్స్ మీదకు పంపుతాయి.  అలా కేంద్రీకృతమైన సౌరశక్తిని అవి మైక్రోవేవ్స్ ద్వారా భూమి మీద పవర్ స్టేషన్లకు పంపుతాయి.  దానితో అపరిమితమైన, పరిశుభ్రమైన విద్యుత్తు భూమికి లభిస్తుంది అని చెప్పారు. 

అయితే ఇది ఇంకా కార్యరూపంలోకి వచ్చి ఫలితాన్ని నిరూపించే దశలోకి రాలేదింకా.  దానికి తోడు ఈ ప్రాజెక్ట్ కి కావలసిన ధనం అంతా ఇంతా కాదు.  దీనికోసం నాసా పరిశోధనా కేంద్రం కొంత నిధిని సమకూర్చింది కానీ అది కాస్తా సెప్టెంబర్ 2012 కే పూర్తిగా తరిగిపోయింది.  ఇప్పడు కనీసం 15 నుంచి 20 బిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మించవలసిన ఈ ప్రాజెక్ట్ కి సంపద కలిగి మానవాళికి సేవ చెయ్యాలనే దృక్పథం ఉన్నవారు దొరికితే ఈ కార్యం నెరవేరుతుందంటారు ఆ శాస్త్రవేత్త.  మొఖమాటం లేకుండా, ఫలితాలకు హామీ ఎవరూ ఇవ్వలేనిదని, పెట్టిన పెట్టుబడి బుడుంగుమన్నా అనొచ్చని అంటారాయన. 

ఈ ఆలోచనకు మూలం 1941 లో రీజన్ అనే పేరుతో ఐసాక్ ఎసిమోవ్ ఒక కథ రాసారు.  అందులో స్పేస్ స్టేషన్ ని నిర్వహించే రోబాట్ లు సౌరశక్తిని గ్రహించి భూమికి ఇతర గ్రహవాసులకూ పంపుతుంటాయి.  మళ్ళీ దీనిమీద 1960 వరకూ ఎవరూ ఆలోచించలేదు.  ఎయిరో స్పేస్ ఇంజినీర్ పీటర్ గ్లేసర్ ఈ దిశగా పరిశోధించటం మొదలుపెట్టారు.  ఆ తర్వాత దశాబ్దాల కాలం వరకూ పరిశోధనలు జరుగుతూనేవున్నాయి కానీ ఏదీ కార్యరూపం దాల్చలేదు.  నాసా, అమెరికా లోని ఎనర్జీ డిపార్ట్ మెంట్లు ఈ పరిశోధనను చేపట్టాయి.  కానీ ఇది చాలా ఖర్చు కూడుకున్నది, ఫలితం చెప్పలేనిది అని శాస్త్రవేత్తలందరూ నిట్టూర్చారు.

కానీ ఇదే ప్రాజెక్ట్ కి ఈ మధ్యకాలంలో అమెరికా, రష్యా, చైనా, భారత్, జపాన్ ఇంకా ఇతర దేశాలలో ఊపందుకుంది.  అందుకు కారణం విపరీతంగా పెరిగిపోయిన చమురు ధరలు.  వాణిజ్య అంతరిక్ష పరిశ్రమను స్థాపించి తద్వారా భూమ్మీది పరిశ్రమలకు చేయూతనివ్వవచ్చన్నది ఆలోచన.  సోలార్ హై అనే అమెరికన్ సాంకేతిక సలహా సంస్థకు చెందిన రాల్ఫ్ నాన్సేన్, ఇంధనం లో దీన్ని మించింది మరొకటి లేదని చెప్తూ, కొంచెం అతిశయోక్తి అనిపించినా, వచ్చే శతాబ్దంలో మనకు రోదసీ నుంచే విద్యుత్తు లభిస్తుందనటంలో అతిశయోక్తి లేదంటారు.  కనుక దీనికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ పరిశోధనకు కావలసిన నిధులను సమకూర్చమని అమెరికన్ ప్రభుత్వానికి చెప్తున్నారు. 

బొగ్గు తవ్వి పరిశ్రమలలో ఉపయోగించటం మొదలుపెట్టిన తర్వాత ఇంగ్లాండ్, టెక్సాస్ లోని బ్రైన్స్ విలే లో చమురు లభించిన తర్వాత అమెరికా అభివృద్ధి చెందినట్లే, స్పేస్ బేస్డ్ సోలార్ పవర్ (ఎస్ బి ఎస్ పి) వలన దీన్ని మొదలు పెట్టిన వారు కూడా ప్రపంచంలో అత్యంత శక్తివంతులుగా తయారవుతారంటారాయన. 

భూమి మీద కంటే రోదసీలో సౌరశక్తి 30 శాతం అధికంగా ఉండటంతో విద్యుదుత్పత్తి కూడా అధికంగా ఉంటుంది.  అందువలన ఎస్ బి ఎసి పి స్టే,షన్ ని సరైన చోట సరైన దిశలో ఉంచినట్లయితే 365 రోజులూ నిర్విఘ్నంగా నిర్విరామంగా విద్యుత్ అందుతుంది శాస్త్రవేత్తల అభిప్రాయం. 

ఈ ఆలోచన ఒక కల్పిత కథ వలన మొదలైనా, కార్యరూపం దాలిస్తే అంతకంటే కావలసింది ఇంకేముంటుంది.  ప్రత్యక్ష నారాయణుడని పేరుగాంచిన సూర్యభగవానుడైతే ఇవ్వటానికి తయారుగానే ఉన్నాడు ఇక మన వంతు పని మనం చేసుకోవాలంతే. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bomb scare at hyderabad mgbs
Tdp celebrates 150 days padyatra mark of chandrababu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles