Coming soon paid youtube channels

youtube, paid channels, android polid website, youtube mobile yap, subscribe and unscribe, add age institution, google website, video producers, pay specialist channel, you tube ceo salar kamangher

Coming soon: paid YouTube channels?

YouTube.gif

Posted: 02/27/2013 06:49 PM IST
Coming soon paid youtube channels

Coming soon: paid YouTube channels?

ఇక నుండి యూట్యూబ్ లో ఉన్న వీడియోలను ఫ్రీగా చూసే అవకాశం  ఉండదనే విమర్శలు వినిప్పిస్తున్నాయి.  ఇప్పటి వరకు  మనం ఉచితంగా కొన్ని వందల వీడియోలు చూసి ఉంటాం. అలాగే కొన్ని వేల వీడియోలను డౌన్ లోడు చేసుకోవటం జరిగింది. ఇక నుండి ఇలా చెయ్యలంటే.. తప్పనిసరిగా  డబ్బులు కట్టాల్సిందేనట.   ఈ విషయం పై నెట్ ప్రేమకులు  మండిపడుతున్నారు.   అసలు అలా ఎందుకు చేస్తున్నరంటే.. గూగుల్  సంస్థ  యూట్యూబ్ లో  పెయిడ్ చానెళ్లను  ప్రవేశపెట్టే యోచనలో  ఉన్నట్లు  ‘ఆండ్రాయిడ్  పోలీస్’  వెబ్ సైట్  చెబుతోంది.  ఇందుకు .. యూట్యూబ్  మొబైల్  యాఫ్ (అప్లికేషన్)  కోడ్ లో  ఉన్న రెండు లైన్లను రుజువుగా  చూపిస్తోంది.  యూట్యూబ్ లోని  పెయిడ్  ఛానెళ్లను  చూడాలన్నా , వద్దనుకున్నా (ఆన్ సబ్ స్ర్కైబ్ ) కంప్యూటర్  ద్వారానే  చేయాలని ఆ కోడ్ లో ఉంది. యాడ్  ఏజ్  సంస్థ ప్రకారం .. దీనిపై  గూగుల్  ఇప్పటికే  పలువురు  వీడియో ప్రొడ్యూసర్లతో   మాట్లాడినట్లు తెలుస్తోంది.  పే స్పెషలిస్టు ఛానెళ్ల  కోసం దరఖాస్తులు  ఆహ్వానించింది.  యూట్యూబ్ తో ఒప్పందాలు  కుదిరితే  సదరు చానెళ్లు నెలకు 1 నుంచి  5 డాలర్ల దారా (రూ.54 నుంచి రూ. 270) దాకా వసూలు చేసే అవకాశం ఉంది.  ఈ నేపథ్యంలో  గతంలోనే  యూట్యూబ్  ‘చందా ఆధారిత’ కంటెంట్ ను  ఇచ్చే  యోచనలో ఉన్నట్లు పేర్కొంది.  మా సైట్ లో  కంటెంట్ను  ఉంటే చాలా మంది ఆ సబ్ స్ర్కిప్షన్ల ద్వారా  తాము బాగా లాభపడతామన్న  ఆలోచనలో ఉన్నారు.  కాబట్టి  మేము కూడా ఆ దిశగా  ఆలోచిస్తున్నాం అని యూట్యూబ్  సీఈవో సలార్ కమన్ గర్  ఒక మీడియా సమావేశంలో  వెల్లడించారు.  తాజా వార్తపై  సీనెట్ వెబ్ సైట్  యూట్యూబ్ ను సంప్రదించగా .. ఆ సంస్థ అధికార ప్రతినిది  ఒకరు దీన్ని ద్రువీకరించారు. ఈ సారి మేము  ప్రకటించడానికి ఏం లేదు.  యూట్యూబ్  యూజర్లు  మరింతగా  ఆనందించే  అవకాశాన్ని   కల్పిస్తూ.. అదే సమయంలో  వీడియోలు పోస్ట్ చేసేవారికి ఆదాయం వచ్చేలా  సబ్ స్ర్ర్కిప్షన్  సర్వీసు ను  అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu political leaders fire on vayalar ravi
Bjp calls rail budget 2013 rae bareli budget  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles