Pre budget survey suggests subsidy cuts

indian economy, chidambaram, budget 2013-14

pre-budget survey suggests subsidy cuts

subsidy-to-be-reduced.png

Posted: 02/27/2013 04:46 PM IST
Pre budget survey suggests subsidy cuts

pre-budget-surveyరైల్వే బడ్జెట్ దుమారం అణిగిపోనేలేదు, ఆర్థిక మంత్రి చిదంబరం మరో బాంబు పేల్చటానికి తయారవుతున్నారు.  ఈ బాంబు తయారవుతున్నది ఆర్డిఎక్స్ తో కాదు- సబ్సిడీతో, సబ్సిడీ ఎత్తివేతలతో.  బడ్జెట్ కు ముందుగా సమర్పించే ఆర్థిక సర్వే పార్లమెంటులో పెట్టిన చిదంబరం, వచ్చే సంవత్సరం జాతీయాదాయం గణనీయంగా పెరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తపరచారు.  ప్రభుత్వం కొన్ని ఖర్చులను తగ్గించుకోవాలని సూచిస్తూ, రాయితీలను తగ్గించేసే దిశగా తన ప్రతిపాదనను ప్రవేశపెట్టారు. 

సబ్సిడీని తగ్గించే దిశగా ఇప్పటికే అవసరమైన చర్యలు మొదలైనాయని, చమురు ధర పెరిగిన నేపథ్యంలో డీజిల్ పెట్రోల్ ధరలను పెంచుకునేందుకు చమురు కంపెనీలకు అనుమతులివ్వటం జరిగిందని, అవి అడపాదడపా కొద్ది కొద్దిగా పెంచుకుంటూ పోతున్నాయని, వంట గ్యాస్ మీద రాయితీని సంవత్సరానికి ఇంటికి 9 కి పరిమితం చేయటం జరిగిందని, అయితే వంట గ్యాస్ ధరను పెంచవలసిన అవసరం లేదని కూడా సర్వే లో ఉంది.  రాయితీలు ఇవ్వటంలోని అవకతవకలను దూరం చెయ్యటానికే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ ద్వారా అర్హులైన వారికి రాయితీలు అందుతున్నాయని కూడా సర్వేలో పేర్కొన్నారు.  ఆర్థిక మాంద్యాన్ని తగ్గించటం కోసం రాయితీలలాంటి ప్రభుత్వ ఖర్చులను తగ్గించటం ఎంతైనా అవసరమని కూడా సర్వేలో వివరించారు. 

ప్రధాన ఆర్థిక సలహాదారు రఘురామ్ జి.రాజన్ మాట్లాడుతూ, ప్రస్తుతం దేశం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, అయితే ఇది మొదటిసారి కాదని, అంతకు ముందు కూడా భారత దేశం దీటుగా సమస్యలను ఎదుర్కుందని, అందుకు ప్రభుత్వం తీసుకునే శక్తివంతమైన ఆర్థిక నిర్ణయాలు తోడ్పడతాయని అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hyderabad bomb blast suspect found in jammu
Dl ravindra reddy vs mla veera siva rddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles