వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన కుంభకోణాన్ని ఎన్ ఫోర్స్ మెంటు డిపార్ట్ మెంటు ధృవీకరించింది. జగన్ పేరుమీదున్న ఆస్తులు, ఎమ్మార్ ప్రోపర్టీస్ కి చెందిన మొత్తం 122 కోట్ల రూపాయల విలువ గల ఆస్తులను జప్తు చెయ్యటానికి న్యాయనిర్ణయ ప్రాధికార సంస్థ నిర్ణయించింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కి చెందిన 71 కోట్లు, అరబిందో ఫార్మా, హెటిరో డ్రగ్స్, జగతి పబ్లికేషన్స్, జననీ ఇన్ ఫ్రాలకు చెందిన 51 కోట్ల రూపాయలను నేరపూరితంగా, చట్ట విరుద్ధంగా ఆర్జించారని నిర్ణయిస్తూ, ఆయా ఆస్తుల జప్తుకు న్యాయనిర్ణయ ప్రాధికార సంస్థ తుదితీర్పునిచ్చింది.
సిబిఐ, ఇడిలు చేసిన అభియోగాలు, ఇరు పక్షాల వాదోపవాదనలు విన్న తర్వత, ఆస్తులను ఇడి కి అప్పగించటానికి నిర్ణయం జరిగింది. ఏ సంస్థా ఆ ఆస్తులను ఉపయోగించుకోవటానికి కాని, అద్దెకు ఇవ్వటానికి కానీ వీలుండదు. ఇడి నిర్దేశాల మేరకే వాటి ఉపయోగం జరుగుతుంది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టన దివంగత రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహనరెడ్డి తండ్రి అధికారాన్ని దుర్వినయోగం చేస్తూ, వసూలు చేసిన లంచాలను వివిధ కంపెనీలలో వాటాల రూపంలో అందుకున్నారని ఇడి నిర్ధారించింది. వివిధ కాంట్రాక్టులను, సెజ్ లను రియల్ వ్యాపారులకు ధారాదత్తం చేసి ప్రతిఫలంగా వారి దగ్గర నుంచి వచ్చిన ముడుపులను ఈ విధంగా కంపెనీ షేర్ల రూపంలో అధిక ముఖ విలువకు కోనుగోలు చేసి పెట్టుబడి పెట్టారని, ఇది కచ్చితంగా అక్రమార్జనేనని ఇడి తేల్చింది.
ఇక తరువాతి కార్యక్రమంగా ఇడి జగన్ మీద క్రిమినల్ కేసులు పెట్టనుంది. మొదటి విడతలో 51 కోట్ల రూపాయల విలువగల ఆస్తులను (వీటికి ఇప్పటికే ఆమోదం లభించింది), రెండవ విడతలో 144 కోట్ల విలువ గల ఆస్తలను జప్తు చేసిన ఇడి, చట్ట ప్రకారం జప్తు నిర్ధారణై ఆస్తులు చేజిక్కించుకున్న తర్వాత 60 రోజుల లోపులో అవినీతి చట్టం కింది క్రిమినల్ కేసులను నమోదు చెయ్యవచ్చు. ఇడి ఆ పని చెయ్యవచ్చని ఇడి అధికారులు చెప్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more