Chandrababu enquires vemuru police staff

gunturu, vemuru, chandrababu naidu, tdp, padayatra

chandrababu enquires vemuru police staff during padayatra

chandrababu-naidu.png

Posted: 02/20/2013 10:29 AM IST
Chandrababu enquires vemuru police staff

     గుంటూరు జిల్లా వేమూరు నియోజక వర్గంలో జంపన దగ్గర నిన్న చంద్రబాబు పాదయాత్ర చేసారు.  దాదాపూ ఏడు కిలోమీటర్లు నడిచి వేమూరు చేరుకున్న చంద్రబాబు అక్కడ పోలీస్ స్టేషన్లో పోలీసు అధికారులు, ఇతర ఉద్యోగుల బాగోగులను పరామర్శించి తెలుసుకున్నారు.  డిఎస్ పి దగ్గర్నుంచి కాన్ స్టేబుల్ వరకూ వాళ్ళ డ్యూటీల వివరాలు, జీతాలు సక్రమంగా వస్తున్నాయా లేదా, వాళ్ళ ఇబ్బందులేమిటి అని అడిగ్గా, కొందరు, మిలటరీ క్యాంటీన్ లా పోలీసులకు కూడా అటువంటి సౌకర్యం ఉంటే బావుంటుందనే కోరికను వెలిబుచ్చారు.  ఆ విషయంలో తప్పక ఆలోచిస్తానని చంద్రబాబు వాళ్ళకి హామీ ఇచ్చారు. 

     స్వామి కార్యం స్వకార్యం అన్నట్టుగా అన్ని పనులనూ చేసుకోవాలి కాబట్టి, పరామర్శలతో పాటు తమ పార్టీ గురించి చెప్తూ, ఇతర పార్టీల వైఫల్యాలనూ వివరించారు.  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రి చిరంజీవి లక్ష్యంగా విమర్శనాస్త్రాలను గుప్పించారు.  ముఖ్యమంత్రి అహంకార స్వభావం గురించి, వైయస్ బాటలోనే అవినీతి ఫైళ్ళను కొనసాగిస్తున్న వైనం, చిరంజీవి కాంగ్రెస్ లో చేరకపోతే తెదేపాకు అందవలసిన అధికారం గురించి చెప్పారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ak anotni shocked to know about agusta affair
Dccb election officer not traceable  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles