Bjp complains against sharmila and brother anil

brother anil, sharmila reddy, ys rajasekhara reddy, bjp

bjp complains against sharmila and brother anil.

jagan-anil.gif

Posted: 02/18/2013 11:13 AM IST
Bjp complains against sharmila and brother anil

     వైయస్ ఆర్ హయాంలో జగన్ ఒక్కడే కాదు, అనిల్ షర్మలాల పేర కూడా అవనీతి జరిగిందని భాజపా అధికార ప్రతినిధి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ ఆరోపించారు.   బెన్ హర్ అనే అఙాత వ్యక్తి పేరుతో ప్రారంభించిన రక్షణ టివి ఛానెల్ కోట్లాది రూపాయల పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు.  వైయస్ అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత అనిల్ షర్మిల ల ఆస్తులలో వచ్చిన గణనీయమైన మార్పుకి సంబంధించిన పత్రాలను ప్రభాకర్ మీడియా ముందు వెల్లడించారు. 

      వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అభివృద్ధి ముసుగులో పేదల భూములను దోచిపెట్టారని చెప్తూ, పాదయాత్రలు చేసే షర్మల కు వారి ఆక్రోశాలు వినిపించటం లేదా అని ప్రభాకర్ ప్రశ్నించారు.  రాజశేఖర రెడ్డి పాలనలో జరిగిన అవనీతిని మరిచి రాజన్న రాజ్యమని ప్రచారం చెయ్యటం తగదని ప్రభాకర్ అన్నారు. 

     భాజపా ఏ మతానికి కానీ, మత ప్రచారానికి కానీ వ్యతిరేకం కాదు కానీ, మతాన్ని అడ్డుపెట్టుకుని కూడా వైయస్ కుటుంబం ఎన్నికల ప్రచారంలోకి పోతున్నదని, లేకపోతే విజయమ్మ చేతిలో బైబిల్ పట్టుకుని ప్రసంగించాల్సిన అవసరమేమున్నదని, ప్రభాకర్ విమర్శిస్తూ, షర్మిల తో పెళ్ళి చేయటానికి ముందుగా అనిల్ మతం మార్పిడి చేయించలేదా అని ప్రశ్నించారు.  వాళ్ళిద్దరి వందలకోట్ల ఆస్తులనూ బయటపెట్టేవరకూ తాను ఊరుకోనని, సిబిఐ విచారణ జరగాల్సిందేనని, గవర్నర్ ని కలిసి కూడా విషయాలని ఆయనకి వివరించి ఈ అవినీతికి వ్యతిరేకంగా తాను పోరాడి తీరుతానని ప్రభాకర్ అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anna hazare delivers an inspiring speech
Veerappan associates fear hanging  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles