Veerappan associates fear hanging

veerappan, capital punishment, president of India,

veerappan associates fear hanging may take place secretly

veerappan-acomplice.gif

Posted: 02/18/2013 11:02 AM IST
Veerappan associates fear hanging

     ఉరిశిక్షలు విధించిన ఖైదల క్షమాభిక్షలు వరుసగా దేశ రాష్ట్రపతి తిరస్కరణకు గురౌతున్నాయి.  ఎంతో విచారణ చేసిన తర్వతనే అన్ని వాదనలూ విన్నతర్వాతనే న్యాయశాఖకు ఆమోదయోగ్యంగానే న్యాయ నిర్ణయం తీసుకోబడుతుంది.  న్యాయాలయాల్లో వచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ పైకోర్టుకి అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉన్నమాట నిజమే.  అయితే, అత్యున్నత న్యాయస్థానమిచ్చిన తీర్పు తర్వాత కూడా రాష్టపతికి పెట్టుకునే క్షమాభిక్ష అర్జీలు సంవత్సరాల తరబడి ఏ నిర్ణయానికీ నోచుకోకపోవటం కూడా సమంజసం కాదని మేధావి వర్గాలు చాలా సంవత్సరాల నుంచి విమర్శిస్తున్నాయి. 

     ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత దేశాన్నే కుదిపేసిన ఉగ్రవాదుల క్షమాభిక్ష అర్జీలను తిరస్కరించటం, వారి ఉరి శిక్షలు అత్యంత గోప్యంగా అమలు జరిగిపోవటం జరిగింది.  ఈ పరిణామం మానవతా వాదానికి భిన్నంగా ఉన్నా, దేశవాసుల మనసులో ఏదో తెలియని ఊరట లభిస్తోంది.   న్యాయవిచారణలో జాప్యాలే కాకుండా చివరకు విధించిన శిక్షలు కూడా సకాలంలో అమలు కాక న్యాయం అంటే ఇప్పట్లో జరిగేది కాదులే అనే అభిప్రాయం అందరినీ నీరసపరుస్తూ వస్తోంది.  అధిక శాతం కేసుల్లో శిక్ష విధించటం వలన అన్యాయానికి బలైనవారికి మనశ్శాంతి, సంతృప్తితప్ప మరే విధంగానూ ప్రయోజనం ఉండదు కానీ, శిక్షల వలన సమాజంలో దుండగులు చర్యలకు కళ్ళెం పడుతుందన్న విషయం మాత్రం సత్యం.

     తాజాగా, బెల్గాం జైలులో ఉన్న చందనపు దొంగ వీరప్పన్ అనుచరులకు పడ్డ ఉరిశిక్ష మీద వాళ్ళు పెట్టుకున్న క్షమాభిక్ష అర్జీలను రాష్ట్రపతి తిరస్కరించారని తెలిసి, వీళ్ళని కూడా అలాగే ఎవరికీ తెలియజేయకుండా ఒకరోజు అకస్మాత్తుగా ఉరిశిక్షను అమలు పరుస్తారేమోనని వారి సమీప బంధువులు కలతచెందుతున్నారు.  అందుకు కారణం అధికారులు వాళ్ళని జైలులోకి అనుమతించకపోవటమే.

     ఆ నలుగురు వీరప్పన్ అనుచరులమీద మోపబడిన నేరం- ఏప్రిల్ 9, 1993న పాలార్ వంతెన దగ్గర పోలీస్ వాహనాన్ని పేల్చి 22 మంది పోలీసులు మరణనానికి బాధ్యులయ్యారు.  అందుకు కోర్టు జీవిత ఖైదు విధించగా, ఆ నిర్ణయాన్ని సవాల్ చేసిన కర్నాటక ప్రభుత్వం హైకోర్టు లో కేసు వెయ్యగా, హైకోర్టు నుంచి ఆ ఘటనకు బాధ్యులైన 16 మందిలో నలుగురికి మరణశిక్ష విధించింది.  దానిమీద నిందితులు సుప్రీం కోర్టులో వేసిన అప్పీలు,  దరిమిలా రాష్ట్రపతికి చేసుకున్న వినతి కూడా తిరస్కరణపాలయ్యాయి.  దానితో వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఆందోళనకు గురవుతున్నారు.  ఈ పరిస్థితుల దృష్ట్యా ఉరిశిక్షను నిలిపివేయాలని న్యాయవాదులు వేసిన పిటిషన్ మీద అత్యవసర విచారణ స్పీకరించచాలని కోరిన కోరికను శనివారం సుప్రీం కోర్టు తిరస్కరించింది. 

-శ్రీజ


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp complains against sharmila and brother anil
Kcr birthday celebration in vishaka  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles