Dadi veerabhadra rao comment on bandla ganesh

tdp leader, dhadi veerabhadra rao , comments, bandla ganesh, tollywood producer, gabbarsingh movie, income tax raiding, congress, pcc chief botsa satyanarayana, chiranjeevi, pawan kalyan

dadi veerabhadra rao comment on bandla ganesh.Bandla Ganesh, producer of Pawan kalyan-starrer 'Gabbar Singh' and ... Meanwhile, TDP senior leader Dadi Veerabhadra Rao expressed doubts that union

bandla-ganesh.gif

Posted: 02/13/2013 10:01 AM IST
Dadi veerabhadra rao comment on bandla ganesh

dadi veerabhadra rao comment on bandla ganesh

ఇప్పుడు  టాలీవుడ్  వణికి పోతుంది.  వరుస ఏసిబీ దాడులతో చిత్ర పరిశ్రమలో  అలజడి మొదలైంది.   భారీ చిత్రల నిర్మతల పై  వరుస ఏసీబీ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.  ఒకేసారి  దిల్ రాజ్, డి.వి దానయ్య ఇళ్లపై  దాడులు చేసి టాలీవుడ్ నిర్మాతలకు  షాకిచ్చారు.  ఇప్పుడు  టాలీవుడ్  లో ఇప్పుడిప్పుడే  ఒక స్థాయికి ఎదుగుతున్న బండ్ల గణేశ్ పై  ఇంటి పై ఏసీబీ దాడులు చేసి, కొన్ని విలువైన  డ్యాకుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే  బండ్ల గణేశ్ వెనుక ఎవరో  పెద్ద వ్యక్తి ఉన్నారనే  అనే అనుమానంతో  ఈ దాడులు చేసినట్లు  తెలుస్తోంది. గతంలో చిన్న నటుడిగా ఉండి ఆకస్మికంగా పెద్ద నిర్మాతగా ఎదిగిన బండ్ల గణేశ్ ఎవరి బినామీనో ఆదాయపు పన్ను శాఖ అధికారులు లోతుగా విచారణ జరపాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు దాడి వీరభద్రరావు డిమాండ్ చేశారు. గణేశ్ ఇంట్లో ఐటీ అధికారులు సోదా చేసిన నేపథ్యంలో ఆయనీ విషయాలు ప్రస్తావించారు.

dadi veerabhadra rao comment on bandla ganesh

 'గణేశ్ కోటీశ్వరుడిగా పుట్టలేదు. కానీ కోట్ల రూపాయలతో గబ్బర్‌సింగ్ లాంటి భారీ సినిమాలు తీస్తున్నారు. ఆయన ఎన్ని సినిమాలు తీశారు? అందుకు ఎంత వ్యయం చేశారు? ఆ డబ్బు ఎక్కడనుంచి వచ్చింది? అన్నది అధికారులు విచారణ జరపాలి. ఆయన వద్ద పీసీసీ చీఫ్ బొత్స డబ్బుందా? లేక మరెవరిదైనా ఉందా? అన్నది కూడా లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. ఆయన వెనుక బొత్స ఉన్నారా? లేక గబ్బర్‌సింగ్ సినిమా తీశారు కాబట్టి పవన్ కల్యాణ్ లేదా ఆయన అన్న చిరంజీవి ఉన్నారా అన్నది కూడా తేలాలి. విషయాలు బయటకు రాకుండా ఆ శాఖపై ఒత్తిడి వస్తోంది. తననెవరూ ఏమీ చేయలేరని, ఏం చేసినా కాపాడేవాళ్లు ఉన్నారని బహిరంగ సభల్లోనే గణేశ్ చెప్పారు. తాను హత్య చేసి వెళ్లినా బొత్స తనను కాపాడతారంటూ బాహాటంగానే చెప్పారు. అంతలా కాపాడే సంబంధాలు ఏమిటి? వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి' అని ఆయన అన్నారు. గణేశ్ ఫలానా వారికి బినామీ అని తాను చెప్పడం లేదని, ఎవరికి బినామీనో తేల్చాలని ప్రభుత్వాన్నే తాము కోరుతున్నామని ఆయన చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Japanese senior vice minister of tourism hiroshi kajiyama
Chandrababu naidu completes two thousand kilometers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles