Ap requests centre to extend aadhar card deadline

Andhra Pradesh Government, Aadhar-linked subsidy LPG cylinders, Aadhar cards, ,India,Andhra Pradesh,politics,government

AP requests Centre to extend Aadhar card deadline

AP requests Centre to extend Aadhar card deadline.png

Posted: 02/05/2013 05:37 PM IST
Ap requests centre to extend aadhar card deadline

kiran-reddy

కేంద్రప్రభుత్వం ఆధార కార్డును తప్పని సరి చేస్తూ, గ్యాస్, నగదు బదులీ పథకాలకు లింకులు పెడుతూ, ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంటేనే గ్యాస్ సబ్సిడీ వస్తుందని, ఈ ఆధార్ కార్డు వివరాలను ఈ నెల 15 లోగా సమర్పించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు ఆధార్ కేంద్రాల వద్దకు పరుగులు తీస్తున్నారు. కానీ అక్కడ సరైన కంప్యూటర్లను, సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ వార్తల్ని ఢిల్లీలో బిజీగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి మీడియాలో చూసి, వీటి పై స్పందించారు. దీని పై మాట్లాడుతూ...  ఆధార్ కార్డు గడువుపై ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గ్యాస్, ఆధార్ కార్డు లింక్ గడువును పెంచాలని కేంద్రప్రభుత్వాన్ని కోరామని, ఒకటి రెండు రోజుల్లో కేంద్రం నుంచి సానుకూల ప్రకటన రానుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఆధార్ కార్డుల కోసం ప్రజలు పడుతోన్న ఇబ్బందులను మీడియాలో చూశానని, ప్రజలు ఆధార్ కోసం ఇబ్బందులు పడవద్దని కోరారు. త్వరలో హైదరాబాద్‌లో మరో రెండు వందల ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులను ఆదేశించానని సీఎం తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Attack on mla revanth reddy
Indian engineer arrested for comments on facebook  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles