Eamcet 2013 notification on 8th february

EAMCET notification, JNTU, 8th February 2013

JNTU Convener announced that EAMCET notification will be released on 8th February 2013.

EAMCET Notification.png

Posted: 02/01/2013 10:34 AM IST
Eamcet 2013 notification on 8th february

eamcet-2013ఇంటర్ మీడియెట్ విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్ కోసం జరిగే ప్రవేశ పరీక్ష ఎంసెట్ నోటిఫికేషన్ 2013 ఈ నెల 8వ తేదీన విడుదల కానుంది. కూకట్ పల్లి జేఎన్ టీయూలో జరిగిన ఎంసెట్ 2013 కమిటీ తొలి భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఎంసెట్ పరీక్ష ధరఖాస్తు విధానంలో పూర్తి స్థాయి ఆన్ లైన్ విధానాన్ని అమలు చేయునున్నారు. తొలిసారిగా ధరఖాస్తు ఫారంలో తల్లి పేరును కూడా చేర్చాలని నిర్ణయించారు. ఇక ఈసారి ఎంసెట్ పరీక్ష కోసం మరో నాలుగు కొత్త సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా), చిత్తూరు(చిత్తూరు జిల్లా), జనగాం(వరంగల్ జిల్లా), వనపర్తి(మహబూబ్‌నగర్ జిల్లా)లలో వీటిని ఏర్పాటు చేస్తారు. ఎంసెట్ రిజి స్ట్రేషన్ ఫీజు ఈ సారి కూడా రూ.250గా నిర్ణయించినట్లు చెప్పారు. ఎంసెట్ క్వాలిఫైయింగ్ మార్కులు 25శాతం(160 మార్కు లకు 40)గానే నిర్ణయం జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు లేవని ఆయన తెలిపారు. ఎంసెట్ ర్యాంకుల నిర్థారణలో ఇంటర్ మార్కులకు 25శాతం వెయిటేజి ఈ సారీ అమలవుతుందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sahakara sangam elections
Ex former minister shankar rao arrested  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles