Shinde and telangana issue

Telangana issue, Home minister Sushil Kumar Shinde, Shinde asks for time, month-long deadline, congress party,

Shinde asks for time

Shinde asks for time.gif

Posted: 01/28/2013 11:54 AM IST
Shinde and telangana issue

shinde  and telangana issue

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర హోంశాఖ స్పందించింది. ఈ అంశంపై తేల్చడానికి మరికొంత సమయం కావాలని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఇవాళ ఆ శాఖా మంత్రి సుశీల్ కుమార్ షిండే ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ అంశంపై తుది నిర్ణయం తీసుకోవడానికి మరికొంత సమయం అవసరం అవుతుందని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణపై చర్చలు ప్రారంభమయ్యాయని ఆయన సెలవిచ్చారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ గులాంనబీ ఆజాద్ పాడిన పాటనే షిండే పాడారు. తెలంగాణపై సంప్రతింపుల ప్రక్రియ కొనసాగుతోందని, మూడు ప్రాంతాల నేతలు, సీఎం, పీసీసీ చీఫ్‌లతో చర్చలు జరుపుతామని పేర్కొన్నారు. నిర్థిష్టమైన కాలపరిమితి లేనప్పటికి వీలైనంత త్వరగా చర్చలు పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. నెల రోజుల గడువు పెట్టినప్పటికీ ఇంకా చర్చల ప్రక్రియ పూర్తి కాలేదని తెలిపారు. సంప్రతింపులు జరుగుతున్నందున నిర్ణయానికి రావడానికి మరికొంత సమయం పడుతుందని షిండే అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Brazil nightclub fire kills 245
Telangana bandh on january 29  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles