Bhogi festival in all over andhra pradesh

bhogi festival, bhogi festival in all over andhra, bhogi festival in andhra pradesh, bhogi festival in west godavari, bhogi in east godavari, bhogi in rayalaseema, bhogi

bhogi festival in all over andhra pradesh

15.gif

Posted: 01/13/2013 01:39 PM IST
Bhogi festival in all over andhra pradesh

bhogi

       తెలుగువారి పెద్దపండుగ సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. తొలిరోజు భోగి పర్వదినాన్ని తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ తెల్లవారుజాము నుంచే పల్లెల్లో భోగి మంటలు వేశారు. పిల్లలు, పెద్దలు కొత్త బట్టలు ధరించి సంప్రపాయబద్దంగా పండుగ చేసుకుంటున్నారు. చిన్నారులు ఎంతో ఉత్సాహంగా భోగి మంటల్లో పిడకలు వేశారు. మరోవైపు రాష్ట్రంలోని దేవాలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. సొంతూర్లో సంక్రాంతి పండుగ జరుపుకోవాలన్న ఉద్దేశంలో చాలా మంది హైదరాబాద్ నుంచి ఇంకా పల్లెలకు పయనమవుతూనే ఉన్నారు. దీంతో ముఖ్యంగా హైదరాబాద్ నగరం బోసిపోయింది. ఎప్పడూ ఎంతో రద్దీగా ఉండే రోడ్లు జనసంచారంలేక నిర్మానుషంగా కనిపిస్తున్నాయి. అటు పల్లెలు మాత్రం కొత్త అల్లుళ్లు, చుట్టాలరాకతో కళకళలాడుతున్నాయి.

        ఇదిలా ఉండగా,  తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాకలో ఈ తెల్లవారుజామున భోగి మంటల వేడుకల్లో అపశ్రుతి జరిగింది. భోగి మంటలు వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్షతగాత్రుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. భోగి మంటల్లో పేయింట్ డబ్బా వేయడమే ఈ ప్రమాదం జరగడానికి కారణంగా తెలుస్తోంది.

       కాగా,  ఖమ్మం జిల్లా సెయింట్ జోసఫ్ స్కూల్లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొన్నారు. ముగ్గుల పోటీలలో విజేతలకు ఆయన బహుమతులు ప్రదానం చేశారు. అంతా సుభిక్షంగా ఉండాలని కాంక్షించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bhakta prahladam in state wide
Benefits for pakistan cricket team  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles