Minister dl ravindra reddy

DL Ravindra Reddy, Minister DL Ravindra Reddy, congress party, ys jagan, jail, Minister DL Ravindra Reddy press meet, ysrcp, jagan release, ysrcp leaders,

Minister DL Ravindra Reddy

DL Ravindra Reddy.gif

Posted: 01/04/2013 04:40 PM IST
Minister dl ravindra reddy

Minister DL Ravindra Reddy

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  సాగుతున్న  కోటీ సంతకాలు సేకరణ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే  ఈ కోటి  సంతకాలు పై  ఆరోగ్య, కుటుంబ సంక్షేమ  శాఖ మంత్రి  డీఎల్ రవీంద్రా రెడ్డి  విమర్శలు చేస్తున్నారు.   జగన్ జైలు నుండి బయటకు రావటానికి  ఆ పార్టీ నాయకులు కోటీ సంతకాల సేకరణ చేస్తున్నారు.  కోటీ సంతకాలు చేస్తే  జగన్  బయటకొచ్చేటట్లైతే  తప్పు చేసిన  మా మంత్రులు రెండు కోట్ల  సంతకాలు  చేయిస్తారని  ఎద్దేవా చేశారు.  కడప జిల్లా  మైదకూరు  మండలం లోని  చాపాడులో  స్వయం సహాయక  సంఘాల  మహిళలకు  రుణపంపిణీ  కార్యక్రమంలో మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి  పాల్గొన్నారు. ఆ సమయంలో  విలేకరులు  జగన్ పార్టీ చేస్తున్న  కోటి  సంతకాలు  గురించి  ప్రస్తావించగా .. సంతకాలు  చేసి  బయటకు  రాగలగితే జైల్లో  ఉన్న  గ్యాంగ్ స్టర్ లు,  మంత్రులు  రెండు కోట్లు  కాకపోతే  ఐదు కోట్ల  సంతకాలు  సేకరిస్తారని,  అంతమాత్రం  చేత వారు  బయటకు  వచ్చేస్తారా?  అని ఆయన ప్రశ్నించారు. ఒక స్నేహితుని కొడుకుగా  జగన్  బయటకు  రావాలని  కోరుకుంటున్నట్లు  ఆయన చెప్పారు.  అయితే  డీఎల్  కాంగ్రెస్ పార్టీ మంత్రుల గురించి మాట్లాడినట్లు?  లేక  జగన్ బయటకు రావాలని   చెప్పినట్లా? అక్కుడున్న విలేకర్లు అనుకుంటున్నారు. మంత్రి డీఎల్ రవింద్రారెడ్డి ఏ ఉద్దేశంతో  చెప్పారో గానీ, ఆయన చెప్పింది  అక్కడున్న ఎవ్వరికి అర్థం కాలేదట. కానీ ఒక్కటి మాత్రం  అందరికి  అర్థం అయిందని  అంటున్నారు.  జగన్  బయటకు వస్తే , డీఎల్ రవింద్రా రెడ్డి  కాంగ్రెస్ పార్టీ  నుండి  జగన్ పార్టీలోకి వెళ్లటానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.  మొత్తం మీద  డీఎల్ రవీంద్రా రెడ్డి మనసులో  మాట చెప్పినట్లు  సమచారం . 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Murder accused shiv kumar jumps from train
Paritala sunitha crying on press meet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles