Three mbbs students debarred for hi tech copying

hree MBBS students, Three MBBS students debarred for hi-tech copying,3 Medical Students,Rajiv Gandhi University, hi-tech copying

Three MBBS students debarred for hi-tech copying

MBBS students.gif

Posted: 01/03/2013 01:52 PM IST
Three mbbs students debarred for hi tech copying

Three MBBS students debarred for hi-tech copying

విద్యార్థులు  హైటెక్ కాపీయింగ్ కు పాల్పడుతున్నారు.   బెంగళూరు లో ముగ్గుర ఎంబీబీఎస్ చదివే విద్యార్థులు హైటెక్  కాపియింగ్ పాల్పడినట్లు సమాచారం.   రాజీవ్ గాంధీ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం లో  ముగ్గురు విద్యార్థులు హైటెక్  కాపియింగ్ చేస్తూ  దొరికిపోయారు.  వారిని ఆ వైద్యశాల  డిబార్ చేసింది.  డిసెంబర్ 19న జరిగిన  హైటెక్  కాపియింగ్  విషయాన్ని   విశ్వవిద్యాలయం  ఉపకులపతి  డాక్టర్  అశోక్  కుమార్  వెల్లడించారు.  దీనిపై  విచారణకు  ఉన్నత స్థాయి  సమితి ఏర్పాటు  చేశారు.  నివేదిక  వచ్చిన  తరువాత  ముగ్గురిని  శాశ్వతంగా కోర్సుకు  అనర్హుల్ని చేస్తామని  తెలిపారు.   ఎంబీబీఎస్   ఆఖరి  సంవత్సరం  పరీక్షలు డిసెంబర్ 19 నుండి 30 వరకు జరిగాయి.  ఓ పరీక్ష కేంద్రంలో  ముగ్గురు  విద్యార్ధులు  హైటెక్  కాపియింగ్  పాల్పడుతున్నట్లు   అధ్యాపకులతో  పాటు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు.  పరీక్ష   కేంద్రంలో   కూర్చున్న  ముగ్గురు  విద్యార్థులు , బ్లూ టూత్,  పెన్ స్కానర్ల ద్వారా ప్రశ్నపత్రాన్ని  స్కాన్ చేసి  యూట్యూట్ ద్వారా  హైదరాబాద్ లో  ఉన్న మిత్రులకు పంపించారు.  అక్కడి నుంచి జవాబులు తీసుకోసాగారు.  సరైన  సమాధానాలు  రాకపోవడంతో  విసుగు చెందారు.  పదే పదే  చొక్కాను  సవరించుకుంటూ,  మాట్లాడుతూ కనిపించారు.  ఆ గదిలో ఉన్న ఆరుగురు పరిశీలకులు వీరిపై కన్నేశారు. సీసీ  కెమెరాల  చిత్రాలను మరో గదిలోని పరిశీలకులు గమనించసాగారు.  ముగ్గురి వద్దకు వెళ్లి పరిశీలించారు.  ఎక్కడా కాపీలు  కనబడలేదు.  అనుమానంతో  పక్క గదిలోకి తీసుకువెళ్లి  చొక్కాలు  విప్పించారు.  రాసే పెన్నుల్ని  స్వాధీనం  చేసుకున్నారు.  చొక్క కాలర్ కింద ఉన్న  మైక్, ఇయర్ ఫోన్లు కాలర్  మధ్యలో  నెట్ కు  సమాచారం  పంపించే పరికరం ఉన్నట్లు  తేలింది.  సాంకేతిక  నిపుణుల చేత పరీక్ష  చేయించగా  హైటెక్ కాపియింగ్  వ్యవహారం  వెలుగులోకి వచ్చినట్లు డాక్టర్ అశోక్  కుమార్  తెలిపారు.  ఈ ముగ్గురు  కర్ణాటకవారేనని చెప్పారు.  అయితే విద్యార్థుల పేర్లు మాత్రం డాక్టర్  అశోక్ కుమార్  బయట పెట్టలేదు? తర్వలో వారి పేర్లు , ఇతర వివరాలను  వెల్లడిస్తామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pcc chief botsa satyanarayana press meet
Paritala sunitha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles