We will not leave congress kodandaram

kodandaram, telangana, ysr congress, bjp, hyderabad, T JAC meeting, TDP, All party meeting,

Telangana JAC chairman Kodandaram said on Monday that they will not leave Centre and Congress till announce Telangana statehood

we will not leave congress kodandaram.png

Posted: 01/01/2013 10:44 AM IST
We will not leave congress kodandaram

Kodandaramతెలంగాణ జేఏసీ మళ్లీ తన గళాన్ని పెంచింది. ఇన్ని రోజుల నుండి కాస్తంత సైలెంట్ గా ఉన్న టీ జేఏసీ నిన్న జరిగిన జేఏసీ స్టీరింగ్ కమిటీలో కేంద్రానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. సమావేశం అనంతరం మీడియా తో మాట్లాడిన కోదండరామ్... కేంద్రం తమకు తాము విధించుకున్న 30 రోజుల గడువులోగా తెలంగాణ ప్రకటించక పోతే... కేంద్రంతో కొట్లాడతాం... తెలంగాణ ప్రకటించేంత వరకు వారిని నిద్రపోనివ్వం.... మేం నిద్రంపోం... అని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఈ నెల లోపు కేంద్రం ఇవ్వక పోతే... తెలంగాణ ప్రజలు పోరాడి తెలంగాణ తెచ్చుకుంటారని అన్నారు. కాగా జనవరి ఇరవై ఆరు లోగా తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని జెఎసి డిమాండ్ చేసింది.తెలంగాణ అంశంపై మంత్రులపై ఒత్తిడి పెంచడానికి వారిని టార్గెట్ చేయాలని కూడా నిర్ణయించింది.అంతేకాక వారి నియోజకవర్గాలలో ఆందోళనలు నిర్వహించాలని కూడా నిశ్చయించారు. జనవరి మాసం మొత్తం కేంద్రం పై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాన్ని చేపడుతామని టీజేఏసీ చైర్మన్ కోదండరాం చెప్పారు. ఇన్ని రోజులు జరిగిన ఉద్యమం వేరు... ఈ ముప్పై రోజులు జరిగే ఉద్యమం వేరు... ఇప్పుడు మా సత్తా ఏంటో చూపిస్తాం అని కోదండరామ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర నిర్ణయం తీసుకుంటుందో లేదో చూడాలి.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nannapaneni rajakumari comments on tissue
Gade venkat reddy press meet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles