Nannapaneni rajakumari comments on tissue

nannapaneni rajakumari, comments, tdp mlc post, telangana issue, angry on junior party leaders, tdp president chandrababu naidu with rajkumari

nannapaneni rajakumari, comments, tdp mlc post, telangana issue, angry on junior party leaders, tdp president chandrababu naidu with rajkumari

Nannapaneni rajakumari comments on T.Issue.png

Posted: 01/01/2013 12:37 PM IST
Nannapaneni rajakumari comments on tissue

Nanapaneniతెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, ఫైర్ బ్రాండ్, శాసనమండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి తెలుగు దేశం పార్టీ ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం పై తీవ్ర అసంతృప్తి  వ్యక్తం చేశారు. తెదేపా అఖిలపక్ష సమావేశంలో తాను తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెప్పడంతో ఆ పార్టీలో మెల్లి మెల్లిగా అసంతృప్తి రగులుతుంది. సమావేశానికి ముందు సీమాంద్ర నాయకులతో సమావేశం నిర్వహించి ఆ తరువాత తన నిర్ణయాన్ని చెప్పినా కానీ, ఆయనకు నిరసన గళాలు తప్పడం లేదు. నిన్న నర్సారావుపేట ఎంపి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తాను అధినేత మాటను సైతం ఈ విషయం లెక్కచేయనని చెప్పారు. తాజాగా నన్నపనేని రాజకుమారి కూడా  తాను సమైక్యవాదిని అన్నారు. అయితే పార్టీ తెలంగాణకు అనుకూలమని చెప్పినా తాము మాట్లాడలేని పరిస్థితి ఉందని, నా నోరు నొక్కేస్తున్నారని, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడ వద్దని ఆదేశాలు ఉన్నాయన్నారు. తాను పదిహేనేళ్లుగా పార్టీ కోసం పని చేశానని, అందుకే ఎమ్మెల్సీ ఇచ్చారని ఆమె చెప్పారు. తన కంటే కరడు గట్టిన సమైక్యవాది ఎవరూ లేరన్నారు. తెలంగాణకు అనుకూలంగా వైఖరి తీసుకున్నా క్రమశిక్షణకు కట్టుబడి ఏమీ మాట్లాడలేక పోతున్నామన్నారు. కొందమందికి పార్టీలో ఏం చేసినా చెల్లుతుందని ధ్వజమెత్తారు. తాను గట్టిగా మాట్లాడే పరిస్థితిలో లేనన్నారు. మరి నన్నపనేని తన లోపల ఉన్న బాధను వెల్లకక్కడానికి వెనుక కారణం ఏమిటో అని తెదేపా నాయకులు ఆలోచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Brahmins meets president pranab mukherjee
We will not leave congress kodandaram  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles