Cheetah roaming in shamshabad

Shamshabad, Cheetah, Roaming, hyderabad, village people, police, Cheetah Roaming in Shamshabad, cheetahs at Shamshabad

Cheetah Roaming in Shamshabad

Cheetah Roaming in Shamshabad.gif

Posted: 12/27/2012 10:51 AM IST
Cheetah roaming in shamshabad

Cheetah Roaming in Shamshabad

హైదరబాద్ నగరంలో దొంగలు, మాయగాళ్లు, రేపిస్టులు, మాఫియా గ్యాంగ్,  డ్రగ్స్ ముఠాలకు వేదికగా మారిన  నగరంలో..ఇప్పుడు  చిరుతలు కూడా నగరంలోకి వచ్చాయి.  వీరితో పాటు  సహాజీవినం చేస్తున్నాయి. అడవులను వదిలి నగరంలోకి వచ్చిన రెండు చిరుత పులులతో నగర ప్రజలు భయపడుతున్నారు.   హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన  శంషాబాద్ ప్రాంతంలో  చిరుత పులుల  సంచారంతో  గ్రామస్థులు హడలిపోతున్నారు.  అయితే  ఈ రోజు   తెల్లవారు జామున  రెండు చిరుతలు  మూడు  లేగదూడలను మట్టు పెట్టాయి.  పొలాల్లో  పనిచేస్తున్న  రైతులను  పరుగు  పెట్టించాయి.  పశువుల  అరుపుల విన్న రైతులు, ప్రజలు  కర్రలతో  చిరుతల వెంట పడటంతో   అవి  అక్కడ నుండి పరిపోయాయి.  గ్రామస్థుల  సమాచారం మేరకు  శంషాబాద్   పోలీసులు  సంఘటనా  స్థలాన్ని   సందర్శించారు.  ఈ మేరకు  అటవీ శాఖాధికారులకు సమాచారం అందిచారు.   అయితే  ప్రజలు  చిరుతలు  చిక్కేవరకు చాలా అప్రమత్తంగా ఉండాలని   పోలీసులు సూచించారు.  చిరుత పులుల దాడులతో  గ్రామస్థులు భయటకు రాలేకపోతున్నారు.   ఉదయం పూట  చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వలన, మంచు తీవ్రత ఎక్కువుగా ఉండటంతో  రైతులు, ఉదయం బయటకు వెళ్లలేక పోవటంతో.. చిరుత పులులు తమ పని సులువుగా పూర్తి చేస్తున్నాయాని  రైతులు వాపోతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ex speaker suresh reddy attend all party meeting
Bus fare fares to increase on january 1 2013  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles