Ap dsc 2012 postings postponed

AP DSC 2012 postings Postponed.png

Posted: 12/15/2012 10:08 AM IST
Ap dsc 2012 postings postponed

మరో రెండు రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులగా చేరుబోతున్నామని అనుకున్నారు మొన్న డీఎస్సీ 2012 రాసి ఎంపికైన అభ్యర్థులు. ఎన్నో రోజుల నుండి కన్న కల సాకారం కాబోతుందని అనుకున్నారు. కానీ వారి ఆశల పై ప్రభుత్వం నీల్లు చల్లి... మరి కొంత కాలం నియామాకాలను నిలిపివేస్తూ పాఠశాల విద్యా కమిషనర్ ఎన్.శివశంకర్ జిల్లా విద్యా శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎంపికలో  ప్రక్రియలో స్థానిక - స్థానికేతర అంశం పై సందేహాలు తలెత్తడంతో.. పాఠశాల విద్యాశాఖ ఈ ప్రక్రియను తా త్కాలికంగా వాయిదా వేసింది. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం శనివారం అభ్యర్థుల తుది ఎంపిక జాబితాలు ప్రకటించాల్సి  ఉంది కానీ తాత్కాలికంగా వీటిని నిలిపివేశారు. ఇదే కాకుండా అభ్యర్థులకు ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహించాల్సిన కౌన్సెలింగ్ కూడా వాయిదా పడుతోంది.

అయితే.. ఉపాధ్యాయ పోస్టుల్లో 80 శాతం స్థానికులకు, 20 శాతం ఓపెన్ మెరిట్ అభ్యర్థులకు కేటాయించాల్సి ఉంది. ఈ 20 శాతం పోస్టుల భర్తీ కోసం ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతి వల్ల స్థానికులకు అన్యాయం జరుగుతుందంటూ  ఉపాధ్యాయ అభ్యర్థుల నుంచి.. అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం మొత్తం ఉపాధ్యా య పోస్టుల్లో 20 శాతం భర్తీకి రిజర్వేషన్ పాటించాల్సిన అవసరం లేదన్నది వాదన. దీనిపై సర్కారు నుంచి వివరణ వచ్చేంత వరకు డీఎస్సీ-2012 ఉపాధ్యాయ నియామకాల వాయిదా అనివార్యంగా మారింది. మరి మళ్ళీ నియామకాలు ఎప్పుడు చేపడతారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Obama tears up in emotional
Mumbai among world dirtiest cities  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles