Botsa satyanarayana

botsa satyanarayana, pcc chief botsa satyanarayana, pcc chief botsa satyanarayana in delhi, money transfer scheme, congress party, sonia gandi, rahul gandi, delhi, telangana issue, congress mps, congress minister ,

pcc chief botsa satyanarayana in delhi

botsa satyanarayana.gif

Posted: 12/13/2012 07:54 PM IST
Botsa satyanarayana

pcc chief botsa satyanarayana in delhi

 పీసీసీఅధ్యక్షుడు  బొత్స సత్యనారాయణ ఈ రోజు రాత్రికి ఢిల్లీ బయల్థేరి వెళ్ల నున్నారు.  రాహుల్ గాంధీ ఆధ్వర్వంలో  రేపు ఢిల్లీలో  నగదు బదిలీ పథకంపై  జరిగే సమావేశంలో  ఆయన పాల్గొంటారు. నగదు కోసం ఆయన ఢిల్లీ వెళ్లుతున్నట్లు  కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఈ నెల 16న జరిగే పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ, సమైక్యాంధ్రలపై చర్చ వద్దని, ఎవరూ మాట్లాడవద్దని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఎవరనైనా ప్రశ్నిస్తే నేను మాట్లాడతానని బొత్స అన్నారు. తెలంగాణ సున్నితమైన అంశం కాబట్టి అధిష్టానం చూసుకుంటుందని ఆయన అన్నారు. గాంధీభవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమావేశమై ఈ మేరకు మాట్లాడారు. దీనిపై జూబ్లీహిల్స్ శాసన సభ్యుడు విష్ణువర్ధన్‌బాబు మాట్లాడుతూ తెలంగాణపై పార్టీ సమావేశంలో కార్యకర్తలు ప్రశ్నిస్తే ఏం చెబుతారని బొత్స ను ప్రశ్నించారు. అందుకు బొత్స తాను అలా జరగకుండా చూస్తానని విష్ణుతో చెప్పారు. ప్రజాప్రతినిధులు ఎవరూ తెలంగాణపై మాట్లాడవద్దని, మిగిలిన నేతలు మాట్లాడకూండా తాను నచ్చజెపుతానని అన్నారు. అదే సమయంలో కేంద్ర హోంశాఖపై మండిపడ్డ యాదవ రెడ్డికి బొత్స హితవు పలికారు. సొంత పార్టీ పైన విమర్శలు తగవని, అది పార్టీకి నష్టం చేకూరుస్తుందని, అధిష్టానం సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటుందని బొత్స చెప్పారు.

pcc chief botsa satyanarayana in delhi

అయితే తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణ గురించి మాట్లాడక తప్పదని బొత్సకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ భేటీకి హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డితో పాటు రెండు జిల్లాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, మంత్రులు హాజరయ్యారు. తెలంగాణపై అడిగిన నేతలను సబితా రెడ్డి కూడా సముదాయించినట్లుగా సమాచారం. అధిష్టానంపై తెలంగాణ విషయంలో ఒత్తిడి తీసుకు వద్దామని ఆమె సూచించినట్లుగా తెలుస్తోంది. ఎల్బీ స్టేడియంలో 16న జరిగే సమావేశాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను బొత్సతో కలిపి పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కెకె మాట్లాడారు. 16న జరిగే సమావేశంలో తమ అభిప్రాయాలను తప్పకుండా వ్యక్తపరుస్తామన్నారు. సదస్సులో అభిప్రాయం చెప్పవద్దనడం సరికాదన్నారు. కాంగ్రెసులో స్వేచ్ఛ ఉంటుందని, కాబట్టి తమ అభిప్రాయాలు చెబుతామన్నారు. భిన్నాభిప్రాయాలను విభేదాలు అనలేమన్నారు. సదస్సు కాంగ్రెసు పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కూడా అధికారం కాంగ్రెసుదే అన్నారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Delhi visit a casual one governor narasimhan
Major fire in chandni chowk market  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles