Nine parties invited for telangana meet

all-party meeting, december 28th all party meeting, all-party meeting on telangana scheduled, sushil kumar shinde, home minister sushil kumar shinde, home ministry has invited nine political parties , andhra pradesh, invited for telangana meet,all-party meeting on telangana, nine parties invited for telangana meet

nine parties invited for telangana meet

telangana meet.gif

Posted: 12/12/2012 04:29 PM IST
Nine parties invited for telangana meet

 nine parties invited for telangana meet

రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకు కేంద్రం నుండి లేఖలు వచ్చాయి?. ప్రత్యేక తెలంగాణ అంశంపై ఈనెల 28వ తేదీన జరగనున్న అఖిలపక్ష సమావేశానికి వేదిక ఖరారైంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు కేంద్రహోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే కార్యాలయం నార్త్ బ్లాక్‌లో జరగనుంది. ఈ మేరకు రాష్ట్రంలోని తొమ్మిది ప్రధాన రాజకీయ పార్టీలకు కేంద్ర హోంశాఖ లేఖలు పంపింది.  లేఖ సారాంశం...'తెలంగాణ అంశంపై ఈనెల 28న అఖలపక్ష భేటీ జరగనుందని, పార్టీ అధినేతలు రావచ్చునని, లేకపోతే ఆ పార్టీ తరఫున ఇద్దరిని పంపవచ్చు, ప్రధానంగా ఈ సమావేశంలో తెలంగాణపైనే చర్చ ఉంటుందని, మరే ఇతర అంశాలపై చర్చ ఉండదని ఈ విషయాన్ని తొమ్మిది రాజకీయ పార్టీల అధినేతలు గమనించగలరని' హోంశాఖ లేఖలు పంపింది. కాగా ఈనెల 27 నుంచి తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగున్న నేపథప్యంలో అఖిలపక్ష భేటీని వాయిదా వేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సుశీల్ కుమార్ షిండేను కోరిన విషయం తెలిసిందే. సీఎం లేఖపై స్పందించిన షిండే అఖిలపక్ష తేదీని వాయిదే వేసేదిలేదని, 28న ఆల్ పార్టీ సమావేశానికి రావాల్పిందిగా అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాస్తామని, వారు వాయిదా వేయమని కోరితే అప్పుడు ఆలోచిస్తామని షిండే చెప్పిన విషయం విధితమే. కాగా ఈరోజు కేంద్రహోంశాఖ అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాయడంపై టీఆర్ఎస్, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ఈసారైనా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yuvraj singh celebrates birthday on 12 12 12 in a special way
Wife was suspected of killing his fathers son  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles