Excise constable candidates 3 km run

Excise constable, candidates, 3 km run,

Excise constable candidates 3 km run

run for Excise constable candidates.png

Posted: 12/06/2012 12:33 PM IST
Excise constable candidates 3 km run

Excise_Constableరాష్ట్రం లో జరుగుతున్నఏక్సైజ్ కానిస్టేబల్ పరుగు పందాలలో మరొక అపశ్రుతి వెలుగు చూసింది... పరుగు పందెంలో ఈ రోజు, మరొక కానిస్టేబల్, సొమ్మసిల్లి పడిపోయాడు... స్థానిక మెడికల్ క్యాంప్ లో ప్రాధమిక చికిత్స  చేసినా, అతని కాళ్ళు స్వాధీనంలోకి రాలేదు... వెంటనే అతడిని, స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గత పది రోజులుగా ఏక్సైజ్ కానిస్టేబల్ పరుగు పందాలు జరుగుతున్న విషయం మనకు విదితమే. అయితే, పందెం మొదలయిన దగ్గరి నుండి, ప్రతీ రోజు, కనీసం, ముగ్గురు నుండి నలుగురు అభ్యర్ధులు, చలికి కాని, ఇతర ఆరోగ్య కారణాల వల్ల కాని, సొమ్మసిల్లి పడిపోతున్నారు.అయితే ఈ రోజు మాత్రం, ఒక అభ్యర్ధి పరిస్థితి, కాస్త ఉద్రిక్తకు దారి తీసింది. పరుగు పందెం లో భాగంగా, పరుగు తీస్తున్నప్పుడు ఈ అభ్యర్ధి సొమ్మ సిల్లాడు. అధికారులు, అక్కడే ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ లో ఇతడికి ప్రాధమిక చికిత్స చేసినా, ఏం లాభం లేకపోయింది. అభ్యర్ధి కాళ్లు స్వాధీనంలోకి రాలేదు. వెనువెంటనే, అధికారులు, ఈ అభ్యర్ధిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాసేపు చికిత్స తరువాత, ప్రస్తుతం, ఇతడి పరిస్థితి కుదుటపడిందని, ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  High alert in hyderabad today
Red sandalwood worth rs 2 crore seized in mahaboobnagar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles