Ed attached rs884 crores assets of gali

Rs.884Crores attached, Gali Janardhan Reddy Assets attached, Obulapuram Mining assets attached by ED, Gali mining mafia don.

ED attached Rs.884 Crores assets of Gali Janardhan Reddy.

ED attached Rs.884 Crores assets of Gali.png

Posted: 12/06/2012 09:16 AM IST
Ed attached rs884 crores assets of gali

Gali_Janardhanఅక్రమ గనుల ఘనుడు గాలి జనార్థన్ రెడ్డికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గాలి అక్రమాల పై ఉక్కుపాదం మోపింది. గాలి జనార్థన్ రెడ్డికి బ్రాహ్మణి స్టీల్స్ లో షేర్లు 884.13 కోట్ల ఆస్తులను జప్తు చేస్తున్నట్లు బెంగుళూరులో ప్రకటించింది. ఈ ఆస్తులను అక్రమ చలామణీ నిరోధక చట్టం(పీఎంఏల్ఏ) కింద చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.  2007 – 2010ల మధ్య చేపట్టిన అక్రమ గనుల తవ్వకాలపై చేపట్టిన విచారణలో భాగంగా ఆస్తుల్ని జప్తు చేశామని పేర్కొంది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ సుమారు రూ.884.13 కోట్ల విలువైన ఖనిజాన్ని అక్రమంగా తవ్వి, తరలించి బ్రహ్మణి స్టీల్స్‌లో పెట్టుబడిగా పెట్టిందని విచారణలో వెల్లడైందని ఈడీ అధికారులు తెలిపారు. 884.413 రూపాయలకు గాను రూ.10 ముఖ విలువ ఉన్న 88,41,30,000 షేర్లను జప్తు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఇక బ్రాహ్మణీ కంపెనీకి సంబంధించిన అధికారులకు ఈడీ కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ ప్లాంటుకు సంబంధించిన భూమిని, యంత్రాలను, ఇతర పరికరాలను అక్కడి నుంచి తరలించరాదు. మరొకరికి విక్రయించడంగానీ, లీజుకు ఇవ్వడంగానీ చేయరాదు అని అందులో పేర్కొంది. ఈ చర్యతో గాలి జనార్దన రెడ్డి వర్గీయుల్లో గుబులు మొదలైంది. ప్రస్తుతానికి బ్రహ్మణితో సరిపెట్టారని... భవిష్యత్తులో బళ్లారిలోని ఆస్తులను కూడా జప్తు చేసే అవకాశాలున్నాయని బెంబేలెత్తుతున్నారు. ఈ పరిణామం గాలి జనార్థన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బే అని అంటున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని దెబ్బలు తగిలినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ntr statue in parliament
Chandra babu fire on congress party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles