Upa govt wins fdi vote in lok sabha

upa govt wins vote on fdi, fdi in retail, fdi debate, parliament, lok sabha, shiv sena, praful patel, cpm, bjd, sharad yadav, anand sharma

UPA govt wins FDI vote in Lok Sabha

UPA.gif

Posted: 12/05/2012 07:03 PM IST
Upa govt wins fdi vote in lok sabha

UPA govt wins FDI vote in Lok Sabha

లోక్ సభ నుంచి  బహుజన సమాజ్ పార్టీ వాకౌట చేయటంతో .. యూపీఏ ప్రభుత్వం కాస్త ఊపిరి పిల్చుకుంది.   చిల్లర వర్తకంలో  విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అంశంపై  సభలో చర్చ జరిగిన విషయం తెలిసిందే.  అయితే ఇంకాసేపట్లో  ఈ అంశంపై  ఓటింగ్  జరగనుండగా బీఎస్పీ  వాకౌట్  చేయటం  యూపీఏకి వూరట కలిగించే అంశం. లోక్ సభలో బీఎస్పీకి 21 మంది సభ్యులున్నారు.  ఎఫ్ డీ ఐల అంశం పై బీఎస్పీ  అధినేత్రి  మాయావతి  ఇప్పటి వరకు  తమ అభిప్రాయం చెప్పకుండా  సస్పెన్స్ లో  ఉంచిన సంగతి తెలిసిందే.  ఓటింగ్ కన్న ముందే బీఎప్సీ వాకౌట్ చేయటంతో గమనించిన సమాజ్ వాదీ పార్టీ కూడా వాకౌట్ చేసింది.  ఇప్పుడు  యూపీఏ గండం నుంచి గట్టేక్కినట్లే కనిపిస్తుంది.  సమాజ్ వాదీ పార్టీకి సభలో 22 మంది సభ్యులున్నారు. రెండు పార్టీలు వాకౌట్  చేయడంతో ఓటింగ్ వల్ల  యూపీఏకి ఎలాంటి నష్టం ఉండే అకాశాం లేదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.  ఎఫ్ ఢీఐ లపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రవేశ పెట్టిన తీర్మానం  వీగిపోయింది.  చిల్లర  వర్తకంలో  విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను వ్యతిరేకిస్తూ  విపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానం పై స్పీకర్  మీరాకుమార్ ఓటింగ్  నిర్వహించారు.  తీర్మానానికి  అనుకూలంగా 218 ఓట్లు రాగా వ్యతిరేకంగా 253 ఓట్లు వచ్చాయి.  దీంతో ఎఫ్ ఢీఐలపై విపక్షాలు పెట్టిన తీర్మానం వీగిపోయినట్లయింది. ఓటింగ్  సమయంలో  సభలో  మొత్తం 471 మంది సభ్యులున్నారు.  యూపీఏ ఆనందంలో ఉన్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandra babu fire on congress party
Fdi decision was not taken overnight anand sharma  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles