Six killed in hyderabad apartment fire

Six killed in Hyderabad, Six killed in apartment fire, week old baby, sex peoples,

Six people, including a week−old baby, were killed in a massive fire that broke out in sheds erected for a film shoot and later spread to a residential building at Poppalaguda on the city's outskirts, police said Monday.

Six killed in Hyderabad apartment fire.png

Posted: 11/26/2012 01:55 PM IST
Six killed in hyderabad apartment fire

ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లోని పుప్పాల్ గూడలోని ఒక అపార్ట్ మెంట్ అగ్ని కీలల్లో చిక్కుకొని భారీ ప్రమాదం జరిగింది. టీవీ సీరియల్ కోసం వేసిన షెడ్డులో అగ్నిప్రమాదం సంభవించడంతో ప్రక్కనే ఉన్న అపార్ట్ మెంట్ లోకి మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. దట్టమైన పొగ అపార్ట్‌మెంట్‌కు వ్యాపించడంతో అందులో ఉంటున్న వారు ఉక్కిరిబిక్కిరయ్యారు. దట్టమైన పొగలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బయటకు పరుగులు తీశారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు. పుప్పాల్‌గూడ, సెక్రటేరియట్ కాలనీలోని ఐదంతస్థుల బాబా నివాస్ అపార్ట్‌మెంట్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఓ టీవీ సీరియల్ షూటింగ్ కోసం 20 గుడిసెలను, ఓ పెద్ద షెడ్డును వేశారు. ఆదివారం సాయంత్రం ఓ గుడిసెలో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి మిగిలిన గుడిసెలకు అంటుకోవడంతో పాటు క్షణాల్లో పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లోకి వ్యాపించాయి. అందరూ ఒక్కసారిగా మెట్ల గుండా వస్తుండటంతో తొక్కిసలాట జరిగింది. అప్పటికే మంటలు అపార్ట్‌మెంట్‌ను పూర్తిగా ఆక్రమించుకున్నాయి. విషయం తెలియగానే హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సైబరాబాద్ పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, కలెక్టర్ వాణీప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. అగ్ని ప్రమాదంపై దర్యాప్తు జరిపిస్తామని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagam janardhan to start telangana bharosa yatra
Bjp suspends ram jethmalani  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles