5 hour energy drinks cited in 13 deaths

5 hour energy, living essentials, fda, new yory state attorney general, patrick nord, monster energy, manoj bhargava, health news, health, health information,

Energy drink sold in Canada cited in 13 death reports in U.S.

Energy drink.gif

Posted: 11/17/2012 12:39 PM IST
5 hour energy drinks cited in 13 deaths

Energy drink sold in Canada cited in 13 death reports in U.S.

ఇండియన్-అమెరికన్ కు చెందిన కంపెనీ ఉత్పత్తి చేసే శక్తినిచ్చే పానీయం (ఎనర్జీ డ్రింక్) ప్రాణాలు తీస్తోందంటూ ఆరోపణలు రావడంతో అమెరికా యంత్రాంగం దానిపై దృష్టి సారించింది. ‘5-హవర్ ఎన ర్జీ’ పేరుతో ఉత్పత్తి అవుతున్న పానీయం వల్ల గత నాలుగేళ్లలో 13 మంది చనిపోయారని వార్తలు వచ్చాయి. దీంతో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(యూఎస్‌ఎఫ్‌డీఏ) ఈ పానీయంపై దర్యాప్తు ప్రారంభించింది. 2009 నుంచి ఇప్పటివరకు ఈ పానీయంపై ఎఫ్‌డీఏ వద్ద 90 ఫిర్యాదులు నమోదయ్యాయని, వాటిలో 30 కేసులు ప్రాణాపాయానికి సంబంధించినవని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను కంపెనీ సీఈఓ మనోజ్ భార్గవ తోసిపుచ్చారు. తమ కంపెనీకి వ్యతిరేకంగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. తమ ఎనర్జీ డ్రింక్‌లో ఉపయోగిస్తున్న కెఫిన్ వల్లే అది తాగుతున్నవారు అనారోగ్యం బారిన పడుతున్నారంటూ వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రఖ్యాత కాఫీ బ్రాండ్లలో ఉంటున్న కెఫిన్ కంటే తమ పానీయంలో చాలా తక్కువ మొత్తంలో దాన్ని వినియోగిస్తున్నట్టు చెప్పారు. ఆ మరణాలకు, తమ పానీయానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. మీడియా ద్వారా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి డబ్బు సంపాదించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. లక్నోలో జన్మించిన భార్గవ ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసిన 400 మంది అమెరికా ధనవంతుల జాబితాలో ఒకరు కావడం విశేషం. మరోవైపు మరణాలకు, ఆరోగ్యంపై దుష్ర్పభావాలకు ఈ పానీయమే కారణమని బాధితులు, డాక్టర్లు స్పష్టంగా చెప్పలేదని.. అందువల్ల ప్రతి కేసునూ తాము క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని ఎఫ్‌డీఏ వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Saint under the guise of security information move
Slapping of prachanda reflects disillusionment  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles