State minister ganta injured in diwali celebrations

state minister ganta srinivasa rao injured, minister ganta srinivasa rao, diwali accident minister ganta, diwali celebration, bursting crakers, frined residence, andhra pradesh ports and investments minister ganta, minister chiranjeevi,

State Minister Ganta injured in Diwali celebrations

Ganta.gif

Posted: 11/15/2012 10:27 AM IST
State minister ganta injured in diwali celebrations

 State Minister Ganta injured in Diwali celebrations

రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక వసతులు, ఓడరేవుల శాఖల మంత్రి గంటా శ్రీనివాసరావు కు  దీపావళి రోజున బాణసంచా కాల్చే అలవాటు లేదట. అయితే లాసన్స్‌బే కాలనీలోని ఓ స్నేహితుడి ఇంటికి వెళ్లి అక్కడి నుంచి రాత్రి 11 గంటల సమయంలో తిరిగి బయలుదేరుతుండగా.. "ప్రత్యేకంగా చేయించిన చిచ్చుబుడ్లు బాగా వెలుగుతున్నాయి. ప్రమాదం జరిగిన తీరు గురించి మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఓ రెండు కాల్చండి'' అంటూ మిత్రుడు కోరడంతో మూడింటిని వెలిగించానని, నాలుగోది ముట్టిస్తుండగా అది ఒక్కసారిగా పేలడంతో తన ప్యాంటుకు నిప్పు అంటుకుంటుందన్నారు. అయితే జీన్ ప్యాంట్ కావడంతో పాదాలు మాత్రమే కాలాయని చెప్పారు. తాను కిందికి వంగి ఉన్నప్పుడు అది పేలితే ముఖం మొత్తం కాలిపోయి ఉండేదన్నారు. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతోనే బయటపడ్డానన్నారు.  అయితే చిచ్చుబుడ్డి పేలడంతో ఆయన రెండు కాళ్లకూ గాయాలయ్యాయి. వారం రోజుల పాటు ఎటూ కదలకుండా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆయన అమెరికా పర్యటన రద్దయింది. ప్రమాద విషయం తెలియగానే కేంద్ర పర్యాటక శాఖ సహాయమంత్రి చిరంజీవి ఫోన్ చేసి, గంటాను పరామర్శించారు. గాయాలు తగ్గేవరకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు, పలువురు ఎమ్మెల్యేలు మంత్రి గంటా ఇంటికి వెళ్లి పరామర్శించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indian woman dies after being refused abortion in ireland
Warring groups welcome chiru on his maiden visit to vijayawada  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles