Stock guru india the 500 crore investment fraud

delhi Police arrests couple for Rs 493-cr, Stock Guru India fraud, two arrested for rs.493 crore fraud, con couple, rs 500 crore loot, fraudsters, ulhas prabhakar, wife raksha urs, police arrest, stock market, 2 lakh people, 7 states, stock guru India, Inverstments, 20 banks, 94 accounts,

Stock Guru India: The 500 crore investment fraud

Stock.gif

Posted: 11/14/2012 11:18 AM IST
Stock guru india the 500 crore investment fraud

Stock Guru India: The 500 crore investment fraud

భారీ రాబడులు ఇస్తామని రెండు లక్షల మంది ఇన్వెస్టర్లకు టోపీ వేసి రూ.493 కోట్లు దండుకున్న నయవంచక దంపతులను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నాగపూర్‌కు చెందిన ఉల్‌హస్ ప్రభాకర్ ఖైరే(33), ఆయన భార్య రక్షా ఉర్స్(30)ను ఏడాది గాలింపు తర్వాత మహారాష్ట్రలోని రత్నగిరి పట్టణంలో ఢిల్లీ ఆర్థిక నే రాల విభాగం(ఈవోడబ్ల్యూ) నిఘా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి మోసం వివరాలను ఈవోడబ్ల్యూ జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్ గోయెల్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. 11వ తరగతి పాసైన ఖైరే, బీఏ మధ్యలోనే ఆపేసిన ఉర్స్‌లు 2010లో లోకేశ్వర్ దేవ్, ప్రియాంకా సారస్వత్ దేవ్ అనే నకిలీ పేర్లతో ఢిల్లీలో స్టాక్ గురు ఇండియా అనే స్టాక్ మార్కెట్ కంపెనీని ఏర్పాటు చేశారు.

Stock Guru India: The 500 crore investment fraud

తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే తొలి ఆరు నెలల్లో అసలుపై 20 శాతం రాబడిని, ఏడో నెలలో అసలు పెట్టుబడిని తిరిగి చెల్లిస్తామని మదుపర్లను ఊరించారు. దీంతో ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకు చెందిన రెండు లక్షల మందికిపైగా ఇన్వెస్టర్లు రూ.10 వేలు, అంతకు మించిన మొత్తాలను పెట్టుబడిగా పెట్టారు. ఖైరే దంపతులు ఇన్వెస్టర్ల నుంచిరూ.493 కోట్లను సేకరించి తమ కార్యాలయాన్ని ఆకస్మికంగా మూసేశారు. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అజ్ఞాతంలోకి వెళ్లారు. మొరాదాబాద్, డెహ్రాడూన్, గోవా తదితర ప్రాంతాల్లో తలదాచుకున్నారు. వీరి మోసంపై గత ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు పోలీసులకు బాధితుల నుంచి 14వేలకుపైగా ఫిర్యాదులు అందాయి. డెహ్రాడూన్‌లో విద్యాసంస్థను స్థాపించి ఫీజలు దండుకుని బోర్డు తిప్పేశారు. ఆ డబ్బుతో ఢిల్లీలో స్టాక్ గురు ఇండియా కంపెనీని ఏర్పాటు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Judge vijaya chandra second marriage fraud
Pinky pramanik proved as a men  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles