Sandy effect in america

sandy effect in america, hurricane sandy, sandy washington dc,blackout,election day,elections,electrical power outage,hurricane sandy,national election,presidential election,voting

sandy effect in america

sandy.gif

Posted: 10/29/2012 10:51 AM IST
Sandy effect in america

sandy affect in america

అమెరికా తూర్పు తీరంపై శాండీ తుపాను విరుచుకుపడనున్న నేపథ్యంలో ఉత్తర కరోలినా, కనెక్టికట్, న్యూజెర్సీ, న్యూయార్క్, డెలావేర్ తదితర రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. వరద తాకిడి ఉండే హైవేలను మూసేయాలని నిర్ణయించారు. సోమ, మంగళవారాల్లో శాండీతుపాను అమెరికాను తాకవచ్చని భావిస్తున్నారు. దీనికితోడు రెండు భారీ చలి తుపానులు కూడా ఒకేసారి చుట్టుముట్టనుండటంతో తూర్పు తీర ప్రాంతంలో నివసిస్తున్న లక్షలాది మంది పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ఆదేశించారు. తుపానువల్ల కొన్ని రోజులపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడవచ్చని...ప్రజలంతా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, తగినన్ని ఆహార నిల్వలను కూడా సిద్ధం చేసుకోవాలని కోరారు.

sandy affect in america

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్థానిక ప్రభుత్వాలను సమన్వయపరుచుకుంటూ అత్యవసర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. తూర్పు తీరం మొదలుకొని గ్రేట్ లేక్స్ వరకూ సుమారు 1,300 కి.మీ. మేర తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. శాండీ తుపాను వల్ల గంటకు 120 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. అమెరికావైపు దూసుకెళ్తున్న శాండీ తుపాను మార్గమధ్యంలో కరీబియన్ దీవుల్లో విధ్వంసం సృష్టించింది. ఈ దీవుల్లో 65 మంది మృత్యువాతపడగా 3.7 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Whisky sold for 21 lakh
Raghunandan mom wept for his son attitude  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles