Tdp leader kavitha vs sharmila

TDp, leader, kavitha, YS sharmila, padayatra,

TDp leader kavitha vs sharmila

kavitha.gif

Posted: 10/20/2012 05:29 PM IST
Tdp leader kavitha vs sharmila

TDp leader kavitha vs  sharmila

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  చేపట్టిన పాదయాత్ర మూడు రోజుకు చేరుకుంది. షర్మిల చేసే పాదయాత్రలో ఎక్కువ బాగం  ప్రజల కోసం కాకుండా పార్టీలను విమర్శించే పనిగా పెట్టుకుంది. తమ కుటుంబం గురించి కథ కథలుగా చెప్పుకుంటూ , ప్రజలకు హామీలు ఇచ్చుకుంటూ  ముందుకు పోతుంది.  అయితే ఎక్కువ భాగం షర్మిలా టీడీపీ , కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  టీడీపీ పై చేసిన విమర్శలకు  ఆపార్టీ మహిళ నాయకులు  షర్మిల చరిత్ర  గురించి తెలుసుకోమని సలహలు ఇస్తున్నారు. అసలు  పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో స్పష్టం చేయాలని షర్మిలను తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు కవిత డిమాండ్ చేశారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు అనుభవమంత వయస్సు కూడా లేని షర్మిలకు ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేసే స్థాయి కానీ, అర్హత కానీ లేవన్నారు. షర్మిల కుటుంబం రాజకీయాలను దుర్వినియోగం చేసిందని.. తాత రాజారెడ్డి, తండ్రి వైఎస్, అన్న జగన్ చరిత్రలను షర్మిల గుర్తు చేసుకోవాలని కవిత హితవు పలికారు.   'పీవీ నర్సింహారావుపై చెప్పులు విసరడమే కాదు... మరెందరికో వెన్నుపోట్లు పొడిచి మీ తండ్రి వైఎస్ సీఎం అయ్యారు. మీ కుటుంబ చరిత్రను తవ్వి తీయడానికి ఒక్క క్షణం పట్టదు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ కుటుంబీకుడైన అనిల్‌కుమార్ తండ్రి రామారావు కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచిన చరిత్ర షర్మిలది అని కవిత ఆరోపించారు. షర్మిల వ్యక్తిగత విమర్శలు మానుకుంటే మంచిదని.. లేకుంటే ఆమె జీవితచరిత్ర మొత్తాన్ని బయటపెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister ganta srinivasa rao on cmgr movie
Rambabu vs ramulamma  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles