ఎనభై ఏళ్ల తర్వాత తమ ప్రింట్ ఎడిషన్‌కు స్వస్తి చెప్పాలని, 2013 ప్రారంభం నుంచి మొత్తం డిజిటల్ రూపంలోకి మారాలని అమెరికాకు చెందిన ప్రముఖ న్యూస్ మ్యాగజైన్ ‘న్యూస్ వీక్’ నిర్ణయించింది. ఈ నిర్ణయం కారణంగా ఆ సంస్థ ఉద్యోగాల్లో కోత పడే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. వచ్చే డిసెంబర్ 31 సంచికే న్యూస్ వీక్ చివరి అమెరికా ప్రింట్ ఎడిషన్ అవుతుంది. చాలామంది వినియోగదారులు వార్తలను రిసీవ్ చేసుకోవడానికి తమ సెల్ఫోన్లను, టాబ్లెట్లను వాడడం పెరిగి పోతూ ఉండడంతో మీడియా సంస్థలు కూడా ఆన్‌లైన్‌కు మారడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి.
న్యూస్‌వీక్ సంస్థే కాకుండా స్మార్ట్ మనీ మ్యాగజైన్ కూడా డిజిటల్ ఫార్మాట్ కోసం తమ ప్రింట్ ఎడిషన్‌ను మూసివేస్తున్నట్లు గత జూలై నెలలో ప్రకటించింది. స్మార్ట్ మనీలో 25 ఉన్నత స్థాయి పదవులను రద్దు చేయవచ్చని అప్పుడు డౌవ్ జోన్స్ కంపెనీ తెలిపింది. ప్రింట్ ఎడిషన్‌ను మూసివేయాలని న్యూస్ వీక్ తీసుకున్న నిర్ణయం ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. వారపత్రికగా తన భవిష్యత్తు గురించి సంస్థ ఆలోచిస్తోందని గత జూలైలోనే సంస్థ యజమాని అయిన బారీ డిల్లర్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా తమ బ్రాండ్‌కు మంచి పేరే ఉందని, అయితే ముద్రణా రూపంలో వీక్లీ న్యూస్ మ్యాగజైన్‌ను రూపొందించడం అంత సులభం కాదని అప్పుడు ఆయన అన్నారు. డైలీ బీస్ట్ వెబ్సైట్లో న్యూస్‌వీక్ డైలీ బీస్ట్ కంపెనీ వ్యవస్థాపకుడు, ఎడిటర్ ఇన్ చీఫ్ అయిన టినా బ్రౌన్ ఈ ప్రకటన చేసారు. ఆన్లైన్ పబ్లికేషన్ పేరు ‘న్యూస్‌వీక్ గ్లోబల్’గా ఉంటుందని, ప్రపంచవ్యాప్తంగా ఒకే ఎడిషన్ ఉంటుందని, ముందస్తు చందా చెల్లింపు ద్వారా లభించే ఈ ఎడిషన్ టాబ్లెట్లకు, ఆన్లైన్ రీడింగ్‌కు అందుబాటులో ఉంటుందని, డైలీబీస్ట్ వెబ్సైట్లో ఉండే కొన్ని వార్తలు కూడా ఇందులో ఉంటాయని బ్రౌన్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more