Bjp will seal borders if returned to power

Nitin Gadkari, BJP president, borders unprotected, BJYM national president Anurag Thakur

BJP will seal borders, if returned to power

BJP.gif

Posted: 10/19/2012 11:55 AM IST
Bjp will seal borders if returned to power

BJP will seal borders, if returned to power

కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కరీ విమర్శిస్తూ, తమ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే అక్రమ వలసలను అరికట్టడానికి అంతర్జాతీయ సరిహద్దులను మూసివేస్తుందని చెప్పారు. ఈ విషయంలో భారతీయ నాయకులు ఇజ్రాయెల్ నుంచి పాఠాలు నేర్చుకోవాలని, భారత్- చైనాల మధ్య యుద్ధం జరిగి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం ఇక్కడ చేపట్టిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆయన తీవ్రంగా విమర్శిస్తూ, ‘మీరు ఏ దేశాన్నయినా సందర్శించాలంటే వీసా ఉండాలి, ఎన్నో రకాల డాక్యుమెంట్లను సమర్పించాలి. అయితే ఇక్కడ మన దేశంలో మాత్రం సరిహద్దులను బార్లా తెరిచి మీరు మా దేశంలోకి వచ్చి భూములు, ఆస్తులు కొనుక్కోండని అక్రమ వలసదారులకు చెప్తున్నారు’ అని గడ్కారీ అన్నారు. ఒక వేళ మీరు దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినా ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే అన్నీ సర్దుకుపోతారు. కాంగ్రెస్‌కు ఓటేయాలనే విషయం మాత్రం మీరు గుర్తు పెట్టుకుంటే చాలు’ అని ఆయన ధ్వజమెత్తారు. ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్ పార్టీయే కారణమని, అక్రమ వలసలు దేశ సమగ్రతకే ముప్పుగా పరిణమించాయన్నారు. ఫక్రుద్దీన్ అహ్మద్‌నుంచి తరుణ్ గగోయ్ దాకా అసోం నేతలందరూ అక్రమ వలసలను ప్రోత్సహించారని అన్నారు. భారత్-చైనా, అంతర్జాతీయ, ప్రాంతీయ స్థాయిలో శాంతి సుస్థిరతలకోసం కలిసి పని చేయవచ్చని, అయితే అంతమాత్రాన దేశానికి ఎదురవుతున్న ముప్పులను పట్టించుకోకుండా ఉండరాదన్నారు. 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో అసువులు బాసిన అమర వీరుల స్మృత్యర్థం గురువారం గౌహతిలో ‘షాహిద్ శ్రద్ధాంజలి యాత్ర’ ప్రారంభోత్సవానికి హాజరైన బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కరీ ఇలా అస్సామీల సాంప్రదాయ టోపీని ధరించారు. బిజెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యాత్ర గౌహతి నుంచి చైనా సరిహద్దులోని తవాంగ్ వరకు సాగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Newsweek ends 80 year print run to go all digital in 2013
Adivasis launch jala deeksha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles