Telanga congress leaders fight

telanga congress leaders fight , for telangana state hood

telanga congress leaders fight

5.png

Posted: 10/07/2012 12:33 PM IST
Telanga congress leaders fight

t-cong

జనరల్ ఎలక్షన్స్ సమీపిస్తోన్న తరుణంలో తెలంగాణ విషయమై ఆ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.  కేంద్ర మంత్రి అజిత్‌సింగ్‌తో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. ఎంపీ మధుయాష్కీ నివాసంలో ఎంపీలు అజిత్‌సింగ్‌కు అల్పాహార విందు ఇచ్చారు. సమావేశానికి ఎంపీలు రాజయ్య, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మందా జగన్నాథం, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, సీనియర్ నేత కే కేశవరావు, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంలు హాజరయ్యారు. పలు అంశాలపై చర్చించారు.
     మరో వైపు టీ కాంగీ నేతలు పదునైన వ్యాఖ్యలతో ఈ అంశాన్ని మరింత బర్నింగ్ చేస్తున్నారు.  సీమాంధ్ర ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఓ పిచ్చోడు అని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. లగడపాటి ఓ జోకర్ అని అధిష్టాన పెద్దలే చాలాసార్లు అన్నారని తెలిపారు. లగడపాటి మాటలను తెలంగాణ ప్రజలు ఎవరూ నమ్మవద్దని కోరారు. తెలంగాణపై కేసీఆర్‌తో కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరుపుతుందని చెప్పారు.
       త్వరలోనే తెలంగాణ రావడం ఖాయం అని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ స్పష్టం చేశారు. కొంతమంది సీమాంధ్ర అవినీతిపరులే తెలంగాణను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. యూపీఏ భాగస్వామ్య పక్షాల మద్దతు కూడగట్టేందుకు మంత్రి అజిత్‌సింగ్‌తో చర్చించామని తెలిపారు.
        అన్ని పార్టీలను కలుపుకుని తెలంగాణ సాధన కోసం పోరాడుతామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె. కేశవరావు తెలిపారు. ఇప్పటికే టీడీపీ ఎంపీలతో చర్చించామని చెప్పారు. తెలంగాణ పోరాటానికి, ఎంపీలకు కేంద్ర మంత్రి అజిత్‌సింగ్ చేయూతనిచ్చారని పేర్కొన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ap state bjp leaders venkaih naidu
Kcr telangana date tngo meeting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles