Kcr telangana date tngo meeting

kcr telangana date tngo meeting, congress high command, telangana political jac

kcr telangana date tngo meeting

7.png

Posted: 10/07/2012 12:26 PM IST
Kcr telangana date tngo meeting

KCR

దసరా పండుగ లోపే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కచ్చితమైన ప్రకటన వస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వంలోని కీలక వ్యక్తులంతా ఇప్పటికే సానుకూల నిర్ణయానికి వచ్చారని ఆయన శనివారం తనను కలిసిన తెలంగాణ ఎన్‌జీవో, ఇతర జేఏసీ నేతలతో చెప్పారు. హైదరాబాద్ నగరంపై సీమాంధ్ర నేతలకు కొన్ని అనుమానాలు, వాటి నివృత్తి, సీమాంధ్రకు కొత్త రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనే విషయంలో ఇంకా కొంచెం స్పష్టత వంటి అంశాలపై కొంత చర్చ జరిగే అవకాశముందన్నారు. తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వచ్చిన తర్వాత సీమాంధ్ర నేతలు మరోసారి రచ్చ చేయకుండా ఉండటానికి ముందుగా వారితో చర్చించే బాధ్యతను కేంద్రమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌కు కేంద్ర పెద్దలు అప్పగించినట్లు కేసీఆర్ తెలిపారు. కేసీఆర్‌ను టీఎన్‌జీఓ, వివిధ జేఏసీల నేతలు శనివారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండల పరిధిలో గల ఆయన ఫార్మ్‌హౌస్‌లో కలిశారు. ఈ సందర్భంగా వారితో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. ఢిల్లీలో జరిగిన చర్చలు, వాటి ఫలితాలు, తెలంగాణ మార్చ్, రాజకీయ పార్టీలతో మార్చ్ సందర్భంగా జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం వ్యవహారశైలి, భవిష్యత్ కార్యాచరణ వంటి వాటిపై లోతుగా చర్చించారు.
రెండు మూడు రోజుల్లోనే అఖిలపక్ష సమావేశం కూడా ఉండొచ్చునని అంచనా వేశారు. త్వరలోనే తుది విడత చర్చలు జరుగుతాయన్నారు. ఈ చర్చల కోసం ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుందని, దానికోసం ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఢిల్లీకి వెళ్లటానికి సిద్ధం కావాలని సూచించారు. తృణమూల్ కాంగ్రెస్ వల్ల యూపీఏకు కొంత ఇబ్బంది ఏర్పడిందని.. కేంద్ర ప్రభుత్వం దృష్టి మళ్లిందని.. లేకుంటే ఇప్పటికే తెలంగాణపై ప్రకటన వచ్చి ఉండేదని కేసీఆర్ వివరించారు. అదే సమయంలో.. తెలంగాణ ప్రకటన రాకుంటే సమరం తప్పదని, అంతా ఏకమై దేశాన్ని ఊపే స్థాయిలో ఉద్యమం చేద్దామని ఆయన జేఏసీ నాయకులతో వ్యాఖ్యానించారు. మార్చ్’లో ఏకపక్షంగా వ్యవహరించారు. తెలంగాణ మార్చ్ సందర్భంగా జేఏసీలో సమన్వయ లోపంపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వెలిబుచ్చారు. తెలంగాణ మార్చ్ పిలుపు ఇచ్చిన సమయం కూడా సరైనది కాదన్నారు. తెలంగాణ మార్చ్‌ లో టీఆర్‌ఎస్ శ్రేణులే ఎక్కువగా పాల్గొన్నాయని, అయినా తమ పార్టీ నేతలకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన తప్పుపట్టారు. టీఆర్‌ఎస్ శ్రేణులు, నేతలు వేలాదిగా పాల్గొంటే పార్టీ ఎమ్మెల్యేలను, ముఖ్యులను కూడా సభావేదికపైకి ఆహ్వానించలేదని కొందరు ఎమ్మెల్యేల పేర్లను కూడా ఈ సందర్భంగా ఉదహరించారు. సభావేదిక నిర్వహణలో కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు వ్యవహరించిన తీరును కూడా కేసీఆర్ ఆక్షేపించారు. సభా నిర్వహణలో ఏకపక్షంగా వ్యవహరించారని, పిడికెడు మంది కూడా లేని పార్టీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని ఆగ్రహం వెలిబుచ్చారు. మార్చ్‌ ను కొనసాగిస్తామంటూ కోదండరాం ప్రకటించేముందు ఎవరితో చర్చించారని ఆయన ప్రశ్నించారు. మార్చ్‌ ను కొనసాగిస్తామని ప్రకటన చేయటం, ఆ తరువాత విరమించుకోవటం వల్ల ఉద్యమం పరువు పోలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ఉద్యమానికి నష్టం చేయటం మంచిదేనా అని ప్రశ్నించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telanga congress leaders fight
Chandra babu tea rs 1000  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles