First person in the world to live with no heart or pulse

no pulse,no heart,human heart,37-year-old man, six months,Jakub Halik

Czech man becomes the first person in the world to live with no heart or pulse

heart.gif

Posted: 10/04/2012 12:00 PM IST
First person in the world to live with no heart or pulse

Czech man becomes the first person in the world to live with no heart or pulse

ఒక వ్యక్తి చనిపోయిందీ లేనిదీ నాడి పట్టుకుని చూసి చెప్పడం సాధారణం. కానీ.. ఆర్నెల్లపాటు ఒక వ్యక్తి నాడి కొట్టుకోకపోయినా బతికి ఉండటం సాధ్యమేనా? గుండె లేకపోయినా.. కృత్రిమ పరికరాలతో బతకడం అయ్యే పనేనా? ..అంటే, సాధ్యమేనని నిరూపించాడో వ్యక్తి. అతని పేరు.. జాకబ్ హాలిక్ (37). చెక్‌రిపబ్లిక్‌కు చెందిన జాకబ్ అగ్నిమాపక ఉద్యోగి. కొన్నాళ్లక్రితం తీవ్ర అస్వస్థతతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన జాకబ్‌కు పరీక్షలు చేసిన వైద్యులు అతడి గుండెలో ప్రమాదకరమైన కణితి పెరుగుతున్న విషయాన్ని గుర్తించారు. అతనికి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయాలంటే.. సరైన దాత దొరకాలి. అప్పటిదాకా ఆ గుండెతో బతికే పరిస్థితి లేదు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 3న.. వైద్యులు అతడి గుండెను తొలగించి దానికి బదులు రెండు పంపుల్ని అమర్చారు. విద్యుత్ మోటారుతో పనిచేసే ఆ పంపుల్లో ఒకటి ఊపిరితిత్తులకు అనుసంధానమై ఉంటుంది. ఆ పంపులో నిమిషానికి 10 వేల చుట్లు తిరిగే ప్రొపెల్లర్ ఉంటుంది. అది అంత వేగంగా తిరుగుతూ రక్తాన్ని ఊపిరితిత్తులకు సరఫరా చేస్తుంది. అక్కడి నుంచి బయటికొచ్చే ఆక్సిడైజ్డ్ రక్తాన్ని రెండో పంపు రక్తసరఫరా వ్యవస్థకు చేరేలా చేస్తుంది. గుండె మార్పిడి అవసరమైన హృద్రోగులు ఒక్కోసారి సరైన దాత దొరక్క చాలాకాలంపాటు వేచిచూడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో వారి ప్రాణాలను కాపాడేందుకు థొరాటెక్ సంస్థ ఈ పంపుల్ని తయారుచేసింది. గతంలో మెక్సికోకు చెందిన క్రెయిగ్ లూయీస్ (55) అనే వ్యక్తికి ఈ పంపుల్ని అమర్చారు. కానీ, అతడు నెలరోజులకు మించి బతకలేదు. ఇక, ఈ పరికరాలను అమర్చుకున్న రెండో వ్యక్తి జాకబ్ హాలికే. అతడు మాత్రం.. ఈ పంపులతో జీవితాన్ని కొనసాగిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles