Osama bin laden was blind in one eye

Osama bin Laden 'was blind in one eye,Osama bin Laden blind eye claims successor video uploaded Islamist forum

Osama bin Laden 'was blind in one eye

Laden.gif

Posted: 09/28/2012 03:22 PM IST
Osama bin laden was blind in one eye

Osama bin Laden 'was blind in one eye

గత ఏడాది అమెరికా సైనిక దాడిలో మృతిచెందిన అల్‌కాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ గురించి బయటి ప్రపంచానికి తెలియని పలు ఆసక్తికర విషయాలు తాజాగా వెల్లడయ్యాయి. లాడెన్ యువకుడిగా ఉన్నప్పుడు జరిగిన ఓ ప్రమాదంలో కుడి కంట్లో చూపు కోల్పోయాడని, నాటి నుంచి ఒంటికన్నుతోనే జీవించాడని అల్ కాయిదా ప్రస్తుత చీఫ్ అయ్‌మన్ అల్‌జవహరి బయటపెట్టాడు. అలాగే అరబ్ దేశాల్లోని అతిపెద్ద ఇస్లామిక్ ఉద్యమాల్లో ఒకటైన ముస్లిం బ్రదర్‌హుడ్‌లో లాడెన్ సభ్యుడిగా ఉండేవాడని పేర్కొన్నాడు.లాడెన్ స్మృత్యర్థం అతని జీవిత విశేషాలను ‘డేస్ విత్ ద ఇమామ్’ పేరిట వివరిస్తూ గంట నిడివిగల వీడియోను జవహరి ఓ రాడికల్ ఇస్లామిక్ వెబ్‌సైట్‌లో ఇటీవల పొందుపరిచాడు. నాటి సోవియట్ యూనియన్‌లో భాగమైన అఫ్ఘానిస్థాన్‌పై జీహాద్ (పవిత్ర యుద్ధం) జరపాలంటూ పట్టుబట్టినందుకు లాడెన్‌ను ముస్లిం బ్రదర్‌హుడ్ సౌదీ అరేబియా విభాగం నుంచి బహిష్కరించినట్లు జవహరి ఆ వీడియోలో వివరించాడు. తాలిబన్లకు నగదు అందించేందుకు ఓసారి పాక్‌లోని పెషావర్ వెళ్లిన లాడెన్....అరబ్ సాయుధ పోరాటంలో చేరాలన్న ముస్లిం బ్రదర్‌హుడ్ ఆదేశాలను బేఖాతరు చేశాడని చెప్పుకొచ్చాడు. రంజాన్ దీక్షల ప్రారంభం సందర్భంగా ముస్లింలకు జవహరి శుభాకాంక్షలు తెలుపుతున్న సందేశం ఈ వీడియోలో ఉండటంతో ఇది సుమారు రెండు నెలల కిందటిగా భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hk tycoon offers fortune to marry off gay daughter
Heart diseases on the rise among indian youth  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles