Heart diseases on the rise among indian youth

Heart diseases on the rise among Indian youth, Cardiovascular health, Diabetes, Heart disease, Heart disease in youth, High Blood Pressure, Obesity, World Heart Day, World Heart Day 2012

Heart diseases on the rise among Indian youth

Heart.gif

Posted: 09/28/2012 03:16 PM IST
Heart diseases on the rise among indian youth

Heart diseases on the rise among Indian youth

భారత యువతకు హెచ్చరికలాంటి ఒక నివేదికను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) విడుదల చేసింది. జీవన విధానాన్ని, ఆహారపు అలవాట్లను మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రకారం 2020 నాటికి భారత్‌లో మరణాలకు గుండెజబ్బులే ఎక్కువగా కారణమవుతాయట."గతంలో పెద్దవారికి మాత్రమే గుండెజబ్బులు వచ్చేవి కానీ ఇప్పుడు 20 ఏళ్ల వయసువారూ గుండె సంబంధిత వ్యాధులతో మా దగ్గరకు వస్తున్నారు.'' అని ప్రముఖ వైద్యులు నీరజ్ భల్లా వ్యాఖ్యానించారు. మరో ఐదు, పదేళ్లలో 20 శాతం భారత ప్రజలు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడతారని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. జీవన విధానం, ఆహారపు అలవాట్లలో మార్పులే అందుకు ప్రధాన కారణమట."పొగత్రాగడం, జంక్ ఫుడ్ తినడం, వ్యాయామం చేయకపోవడం ఈనాటి యువతకు చెడు అలవాట్లుగా మారాయి.

పని ఒత్తిడి తట్టుకోలేక నేటి యువత తాగుడుకు, పొగతాగడానికి బానిసలవుతున్నారు. దీంతో పరిస్థితి మరింత విషమిస్తోంది'' అని ప్రముఖ వైద్యులు కమల్‌దీప్ సింగ్ వెల్లడించారు. వ్యాయామం చేయడం, జంక్, ఆయిల్ ఫుడ్‌కు దూరంగా ఉండటం, పొగ తాగడం, మద్యం సేవించడం వంటి చెడు అలవాట్లను మానుకోవడం ద్వారా గుండెజబ్బులు రాకుండా నివారించవచ్చని తెలిపారు. "ఒత్తిడి నేటి జీవన విధానంలో భాగమైపోయింది. దాన్ని మనం దూరంగా పెట్టలేం. కానీ ప్రతీరోజు ఒక అరగంట వ్యాయామం లేదా నడక మంచి ఫలితాలు ఇస్తుంది'' అని వైద్యులు చెబుతున్నారు. గుండె జబ్బులపై ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కలిగించేందుకు సెప్టెంబర్ 29వ తేదీని వరల్డ్ హార్ట్ డేగా పాటిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఏడాది కోటి 73 లక్షల మంది గుండెజబ్బుల కారణంగా మరణిస్తున్నారు. 2030 నాటికి ఆ సంఖ్య 2 కోట్ల 30 లక్షలకు చేరుతుందని అంచనా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Osama bin laden was blind in one eye
Telugu film rebel faces trouble  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles