Tdp mlas fired on chandra babu naidu

tdp mlas fired on chandra babu naidu,TDP president Sri Nara Chandrababu Naidu

tdp mlas fired on chandra babu naidu

TDP.gif

Posted: 09/28/2012 11:57 AM IST
Tdp mlas fired on chandra babu naidu

tdp mlas fired on chandra babu naidu

తెలంగాణపై పార్లమెంట్ లో తీర్మానం పెట్టాలంటూ చంద్రబాబు నాయుడు రాసిన లేఖపై టీడీపీ చిచ్చు రేగుతోంది. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి శాసనసభ్యుడు ప్రవీణ్ రెడ్డి చంద్రబాబు వైఖరిపై మండిపడ్డారు. తెలంగాణకు అనుకూలంగా గతంలో రాసిన లేఖను వెంటనే ఉపసంహరించుకోవాలని … లేదంటే టిడిపి పేరును తెలంగాణ టీడీపీగా పెట్టుకోవాలని డిమాండ్ చేశారు.తెలంగాణ మార్చ్ అంటే సీమాంధ్రులపై పరోక్షంగా దాడి జరిపుతున్నట్లేనని ప్రవీణ్ రెడ్డి అన్నారు. రాయలసీమవాసి అయి ఉండి బాబు ఇలా చేయడం సరికాదన్నారు. బాబు నిర్ణయాల వల్లనే టిడిపి ఇలా తయారయిందని ఆరోపించారు. చంద్రబాబు లేఖ ఇవ్వడానికి నిరసనగా… ఆయన నిర్వహించబోయే పాదయాత్రలో నిరసన వ్యక్తం చేస్తానని చెప్పారు. లేఖను ఉపసంహరించుకోకుంటే పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని హెచ్చరించారు. సీమాంధ్రలో దాదాపు అందరూ సమైక్యాంధ్ర కోరుకుంటున్నారని, తెలంగాణ ప్రాంతంలో కూడా దాదాపు సగం మంది అదే కోరుకుంటున్నారని చెప్పారు. బాబుపై తన సొంత జిల్లాలో వ్యతిరేకత ఉందని మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ou campus tense as students clash with police
Bjp accuses centre of diluting telangana march  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles